వానొచ్చే.. వరదొచ్చే.. వెతలు తీసుకొచ్చే. ఇది నగరంలో మూడు రోజుల వర్షానికి లోతట్టు ప్రాంతాల దుస్థితి. అధికారులకు లోతట్టు ప్రాంతాల నుంచి చెట్లు విరిగిపడిన ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లవెత్తుతాయి. బల్దియాలోని కంట్రోల్ రూమ్, EVDM హెల్ప్ లైన్ కు పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయి. డిఆర్ఎఫ్ టీంకు వింత ఫిర్యాదు వచ్చింది. ఏ చెట్టు విరిగిందో నీళ్లు నిలిచాయో గోడ కూలిందా అని కాదు మా పిల్లిని రెస్క్యూ చేయండి అంటూ కంప్లైంట్ వచ్చింది. దీంతో జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం రంగంలోకి దిగింది.
రాజభవన్ ప్రాంతంలో ఉండే DRF టీం వెంటనే కుందన్ భాగ్ వెళ్లి పిల్లిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పిల్లి యజమాని పక్కన ఉన్న నాలాలో పడి పిల్లి కొట్టుకుపోతుందని కాపాడమని విజ్ఞప్తి చేపట్టారు దీంతో నాలాలో పిల్లి కోసం DRF టీం పడుతుంది. పిల్లిని కాపాడేందుకు నలుగురు సభ్యులు ఉన్న DRF ఆపరేషన్ చేపట్టింది. గంటసేపు ప్రయత్నించిన తర్వాత పిల్లిని సురక్షితంగా డిఆర్ఎఫ్ రెస్క్యూ చేసింది. దీంతో ఆ పిల్లి యజమాని టిఆర్ఎస్ బృందానికి కృతజ్ఞతలు తెలిపి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు వర్షాల నేపథ్యంలో నగరంలో శుక్రవారం జిహెచ్ఎంసి లోని ఒక్క EVDM విభాగానికి 33 చెట్లు విరిగిన ఫిర్యాదులు, 11 వాటర్ స్టాగ్నెట్ కంప్లైంట్స్, రెండు గోడ కూలిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులు అన్నిటిని DRF టీమ్స్ అడ్రస్ చేసి పరిష్కరించినట్లు ఈవిడిఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు.
మొత్తంగా DRF బృందాలు వర్ష ప్రభావంతో ప్రమాదానికి గురైన మూగజీవాలను సైతం రక్షించడం పట్ల జంతు ప్రేమికులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఒక మూగ జీవి ప్రాణాన్ని నిలబెట్టిన జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ వింగ్ ను అందరూ మెచ్చుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..