Video: భారీవర్షాలకు కళ్ళ ముందే కుప్పకూలిన పాత భవనం.. రెప్పపాటులో తప్పిన ముప్పు!

|

Sep 04, 2024 | 10:36 AM

ఎడతెరిపి లేకుండా దంచి కొట్టిన వర్షాలు తెలంగాణను పూర్తిగా ముంచేశాయి. ఈ వర్షాలు సృష్టించిన విపత్తు నుంచి కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వరకు ఉతికి ఆరేస్తున్నాయి.

ఎడతెరిపి లేకుండా దంచి కొట్టిన వర్షాలు తెలంగాణను పూర్తిగా ముంచేశాయి. ఈ వర్షాలు సృష్టించిన విపత్తు నుంచి కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వరకు ఉతికి ఆరేస్తున్నాయి. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లా భవానీ పేట గ్రామంలో భారీ వర్షాలకు ఓ ఇల్లు కుప్పకూలింది. వడ్ల సత్తయ్యకు చెందిన పాత భవనం అందరూ చూస్తుండగానే నేలమట్టమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్థులు తెలిపారు. మరోవైపు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..