శభాష్..! ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కొత్త సర్పంచ్.. బాధ్యతలు చేపట్టిన మరునాడే యాక్షన్ షురూ!

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో కొంతకాలంగా కోతుల బెడద గ్రామస్తులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. పంటల నష్టం, ఇళ్లపై దాడులు, చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రామానికి చెందిన చింతలపల్లి విజయమ్మ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తూ సర్పంచ్‌గా గెలిపిస్తే.. గ్రామాన్ని కోతుల బెడద నుంచి విముక్తి చేస్తానని హామీ ఇచ్చారు.

శభాష్..! ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కొత్త సర్పంచ్.. బాధ్యతలు చేపట్టిన మరునాడే యాక్షన్ షురూ!
Save From Monkeys

Edited By:

Updated on: Dec 16, 2025 | 8:31 PM

ప్రజాప్రతినిధిగా గెలిస్తే, హామీలు మర్చిపోతారనే విమర్శలు సాధారణమే. కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్ మాత్రం గెలిచిన మరుసటి రోజే రంగంలోకి దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను చేసి చూపించారు. దీంతో గ్రామ ప్రజలు కొత్త మహిళా సర్పంచ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో కొంతకాలంగా కోతుల బెడద గ్రామస్తులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. పంటల నష్టం, ఇళ్లపై దాడులు, చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రామానికి చెందిన చింతలపల్లి విజయమ్మ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తూ సర్పంచ్‌గా గెలిపిస్తే.. గ్రామాన్ని కోతుల బెడద నుంచి విముక్తి చేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామ ప్రజలు నమ్మకంతో ఆమెను గెలిపించారు. విజయం సాధించిన మరుసటి రోజే విజయమ్మ తన మాటను కార్యరూపంలో పెట్టారు. ఇందుకోసం నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి కోతులను పట్టే నిపుణుల బృందాన్ని గ్రామానికి రప్పించారు. సోమవారం (డిసెంబర్ 15) రోజున ప్రత్యేక ఏర్పాట్లతో 113 కోతులను బోనుల్లో బంధించి అడవికి తరలించారు. ప్రతి కోతిని పట్టుకున్నందుకు రూ.500 చొప్పున చెల్లిస్తున్నామని సర్పంచ్ విజయమ్మ తెలిపారు. గ్రామంలో ఇంకా కోతులు ఉన్నాయని, అన్నింటినీ పూర్తిగా తరలించే వరకు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

కోతుల బెడద తగ్గడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల హామీలు మాటలకే పరిమితం కాకుండా ఇలా వెంటనే అమలయ్యే సందర్భాలు చాలా అరుదు అంటూ గ్రామ ప్రజలు సర్పంచ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మిరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..