
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆది, సోమవారాల్లో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అక్కడక్కడ వడగళ్ల వర్షం కురువొచ్చని కూడా హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆదిలా బాద్, కుమ్రుం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా తెలంగాణలో ప్రస్తుతం గరిష్టంగా 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. సాయంత్రానికి వాతావరణ చల్లబడి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. . కాగా ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన వడగళ్ల వానలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. సాగు పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, వరి, మామిడి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా మరోసారి వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) March 24, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..