అసలీ.. ఆకేరు, మున్నేరు వాగుల ఆవిర్భావం ఎక్కడ..? ఇంతటి విధ్వంసానికి కారణాలేంటి..?

వాగే వారికి జీవనాధారం.. పంటలకు ఆధారం. ఆ వాగే ఇప్పుడు వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఏరు ఎడారిలా మార్చేసింది. ఊళ్లను ముంచెత్తి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఆకేరువాగు ఉప్పెనై.. ఖమ్మం - మహబూబాబాద్ జిల్లాలపై ఒక ప్రళయంలా విరుచుకుపడింది. ఊహించని విషాదాన్ని మిగిల్చి.. వందలాది మందిని నిరశ్రయులను చేసింది.

అసలీ.. ఆకేరు, మున్నేరు వాగుల ఆవిర్భావం ఎక్కడ..? ఇంతటి విధ్వంసానికి కారణాలేంటి..?
Khammam Floods
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 06, 2024 | 1:36 PM

ఆ వాగే వారికి జీవనాధారం.. పంటలకు ఆధారం. ఆ వాగే ఇప్పుడు వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఏరు ఎడారిలా మార్చేసింది. ఊళ్లను ముంచెత్తి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఆకేరువాగు ఉప్పెనై.. ఖమ్మం – మహబూబాబాద్ జిల్లాలపై ఒక ప్రళయంలా విరుచుకుపడింది. ఊహించని విషాదాన్ని మిగిల్చి.. వందలాది మందిని నిరశ్రయులను చేసింది.

ఆకేరువాగు ఉప్పెనై ఖమ్మం – మహబూబాబాద్ జిల్లాలపై విరుచుకుపడింది. ఊహించని విషాదాన్ని మిగిల్చి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. మున్నేరుకు వరద పోటెత్తేలా చేసిన ఆకేరు వాగే ఇప్పుడు అందరి నోటా హాట్ టాపిక్ అయింది. అసలు ఈ వాగు ఆరంభం ఎక్కడ..? దీని ముగింపు ఎక్కడ..? ఏ జీవనదిలో కలుస్తుంది..? ఎన్ని కిలోమీటర్ల నిడివితో ఆకేరువాగు ప్రవహిస్తుంది..? ఎన్ని వేల ఎకరాల సాగుకు ఆకేరువాగు నీరు తోడవుతుంది..? ఆకేరువాగు ప్రస్థానంపై టీవీ9 ప్రత్యేక దృష్టి పెట్టింది.. ఈ వాగు ఎక్కడ పుట్టింది..? ఎందుకు ఒక్కసారిగా ఇంతలా మహాప్రళయాన్ని సృష్టించింది..? ఇన్ని ప్రాణాలు మింగేసిన వాగుకు వరద పోటెత్తడం వెనుక అసలు కారణం ఏంటి..? వివరించే ప్రయత్నం చేసింది టీవీ9..

ఆకేరు వాగు జనగామ జిల్లాలోని నష్కల్ వద్ద ప్రారంభమవుతుంది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల మీదుగా మొత్తం 92 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ వాగుకు 92 కిలోమీటర్ల పరిధిలో 12 ప్రాంతాల్లో చెక్ డ్యాంలు ఉంటాయి. ఎగువన రెండు పాయలుగా వచ్చే ఒక చెక్ డ్యాంలో కలిసి దిగువకు వచ్చి ఆకేరు వాగుగా రూపాంతరం చెందుతుంది. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద మున్నేరు వాగులో విలీనమై చివరకు కృష్ణా బేసిన్‌లో కలుస్తుంది. సముద్ర మట్టానికి 238 మీటర్ల ఎత్తులో ప్రారంభమై కృష్ణా నదిలో కలిసేవరకు మొత్తం 195 కి.మీ నిడివితో ప్రవహిస్తుంది. ఈ వాగు మున్నేరులో కలిశాక ఖమ్మం నగరంలో వరద మరింత పెరిగింది.

ఇనుగుర్తి, రెడ్లవాడ గ్రామాలను వర్షం ముంచెత్తడంతో ఆకేరు వాగుకు వరద పోటెత్తింది. 45.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ఆకేరు వాగు ఉప్పొంగి నాలుగు ఊళ్లను నీళ్లలో ముంచేసింది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆకేరు వాగు వరదతో సీతారాంతండా వణికపోయింది. కట్టుబట్టలతో ఊరిని వదిలి వెళ్లేలా చేసింది. ఆకేరువాగు వరదలతో వేలాదిమంది నిరాశ్రయులు కాగా ఏడుగురు జలసమాధి అయ్యారు. యువశాస్త్ర వేత్త అశ్విని.. ఆమె తండ్రి సైతం ఈ వాగు ప్రవాహంలోనే కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు.

ఆకేరువాగు వరదలు పోటీ ఎత్తడంతో కట్టుబట్టలతో ప్రాణాలు అర చేతులో పెట్టుకుని పరుగులు పెట్టిన జనం ఇప్పుడిప్పుడే వారి గ్రామాలు తండాలకు తిరిగి వస్తున్నారు. గూడు చెదిరి తల్లడిపోతున్నారు. ఆకేరు వరదల్లో అతలాకుతలమైన సీతారాంతండాను ఇటీవల క్రితం సిఎం రేవంత్ రెడ్డి కూడా సందర్శించారు. తెల్లవారుజామున వాగు ఉప్పెనలా విరుచుకుపడడంతో పరుగులు పెట్టిన జనం బిల్డింగ్ ల పై తలదాచుకున్నారు. వాళ్లకి ఇప్పుడు తినడానికి తిండి లేదు.. దీంతో సహాయం అందిస్తున్న దాతలు వారి ఆకలి తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఎక్కడ నాలుగు మెతుకులు కనబడితే అక్కడికి పరుగులు పెడుతున్నారు. ఆకేరు వాగు వరదల్లో సర్వం కోల్పోయిన బాధిత గ్రామాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.

ఉప్పెనల వరద పోటెత్తడంతో గూడు చెదిరింది. వేలాది ఎకరాల పంట పొలాల్లో ఇసుక మేటలు పోసి అన్నం పెట్టే పంట భూములు అక్కరకు రాకుండా పోయాయి.. వాళ్ల వాహనాలు వ్యవసాయ, పనిముట్లు, మోటర్లు, ట్రాక్టర్లు కొట్టుకుపోయి వాగులో కలిసి పోయాయి. అక్కడక్కడా చెట్లకు చిక్కిన వాహనాలను చూసి రైతులు తల్లడిపోయారు. బియ్యం గృహోపకరణాలు తడిసి ముద్దయ్యాయి. పశువులు కూడా తినలేని పరిస్థితి నెలకొంది. దీంతో తడిసిన బియ్యాన్ని అదే వాగులో పారపోసి కన్నీళ్లు దిగమింగుకుంటున్నారు. వేలాది ఎకరాకులకు సాగు నిరంధించి.. ఎన్నో గ్రామాలకు తాగు నీటి అవసరాలు తీర్చే ఆకేరు వాగే ఇప్పుడు వారి పాలిట శాపమైంది.

ఆకేరు – మున్నేరు వాగులు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలను అతలాకుతలం చేసింది. భవిష్యత్ లో ఇలాంటి వరదలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.