Hyderabad: అమానవీయం.. యువతులను నగ్నంగా చేసి.. శరీర భాగాలను ఫొటోలు తీసి..

|

Dec 05, 2022 | 3:54 PM

సమాజంలో మానవ విలువలు రోజురోజుకు పడిపోతున్నాయి. మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న క్రైమ్ రేట్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహిళలపై...

Hyderabad: అమానవీయం.. యువతులను నగ్నంగా చేసి.. శరీర భాగాలను ఫొటోలు తీసి..
Harassment
Follow us on

సమాజంలో మానవ విలువలు రోజురోజుకు పడిపోతున్నాయి. మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న క్రైమ్ రేట్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహిళలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా హైదరాబాద్ మహా నగరంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మహిళలు, అమ్మాయిలను మాటలతో నమ్మించి.. వారి శరీర భాగాలను ఫొటోలు, వీడియోలు తీసేవారు. వాటిని వ్యభిచార కొంపకు పంపేవారు. వారు అక్కడ వాటిని చూసి ఆయా అమ్మాయిలు, మహిళలకు ధర నిర్ణయించేవారు. ఒక సామాజిక కార్యకర్త చేసిన ధైర్యంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లాలోని రాజేశ్వర్‌ గ్రామానికి చెందిన సయ్యద్‌ హుస్సేన్‌.. లారీ డ్రైవర్‌ గా పని చేస్తున్నాడు. అతనికి కలబురిగి ప్రాంతానికి చెందిన వ్యభిచార కూపాలను నిర్వహించే గులాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం పెరిగింది. గులాం మాటలు విన్న హుస్సేన్.. హైదరాబాద్ కు వచ్చాడు. పాతబస్తీలో తన బంధువుల వద్దకు వెళ్లి.. తాను పని కోసం వచ్చానని, ఇక్కడే ఉండి చూసుకుంటానని చెప్పి నమ్మించాడు. అంతే కాకుండా గది అద్దెకు ఇప్పించాలని కోరాడు. అతని అభ్యర్థనతో. వారు తమ ఇంట్లోనే ఓ గది అద్దెకు ఇచ్చారు.

ఈ క్రమంలో ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన ఓ మహిళతో కలసి వ్యభిచారానికి అనువుగా ఉండే యువతుల కోసం గాలించేవారు. ఒంటరిగా కనిపించే అమ్మాయిలు, ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి.. పని ఉందని నమ్మించేవాడు. రూమ్ కు తీసుకెళ్లేవాడు. అనంతరం వారిని ఫొటోలు తీసేవాడు. ముఖం, పాదాలు కనిపించకుండా మిగతా శరీర భాగాలను షూట్ చేశాడు. వాటిని కలబురిగిలోని గులాంకు వాట్సప్‌ చేసేవాడు. వాటిని చూసి గులాం వారికి ధర నిర్ణయించేవాడు. వారం రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా మహిళల వివరాలు సేకరించడం గమనార్హం.

అయితే హుస్సేన్ ప్రవర్తన భిన్నంగా ఉండటంతో పలువురికి అనుమానం వచ్చింది. వారు ఈ విషయాన్ని ఓ ఛారిటీ ట్రస్ట్ కు చెప్పారు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వారు హుస్సేన్ వద్దకు వెళ్లారు. తాము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని, పని చూపించాలంటూ డ్రామా ఆడారు. వీరి మాటలు నమ్మిన హుస్సేన్.. వారిని తనతో పాటు గదికి తీసుకెళ్లాడు. అనంతరం ముందస్తు ప్లాన్ ప్రకారం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఉంటున్న చోటుకు చేరుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు హుస్సేన్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి సెల్‌ఫోన్‌లో వీడియోలు, చిత్రాలను గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం