Jagtial: పీక్స్ కి చేరిన జగిత్యాల మాస్టర్ ప్లాన్ మంటలు.. ప్రాణాలు వదిలేందుకూ సిద్ధమంటున్న సర్పంచ్‌లు..

|

Jan 17, 2023 | 6:16 AM

పట్టణాల మాస్టర్‌ ప్లాన్‌ లు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కామారెడ్డికి పరిమితమైన నిరసనలు.. ఇప్పుడు జగిత్యాలకు తాకాయి. జగిత్యాల మాస్టర్ ప్లాన్ పై కదం తొక్కారు రైతులు. జీవో...

Jagtial: పీక్స్ కి చేరిన జగిత్యాల మాస్టర్ ప్లాన్ మంటలు.. ప్రాణాలు వదిలేందుకూ సిద్ధమంటున్న సర్పంచ్‌లు..
Jagtial Master Plan
Follow us on

పట్టణాల మాస్టర్‌ ప్లాన్‌ లు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కామారెడ్డికి పరిమితమైన నిరసనలు.. ఇప్పుడు జగిత్యాలకు తాకాయి. జగిత్యాల మాస్టర్ ప్లాన్ పై కదం తొక్కారు రైతులు. జీవో ఉపసంహరించుకోవాలని సర్కార్‌కు అల్టిమేటమ్ ఇచ్చారు. సెంటు భూమి పోతే టెంటు వేసుకుని కూర్చుంటామే తప్ప వెనక్కి తగ్గబోమన్నారు. అవసరమైతే ప్రాణత్యాగాలకు సిద్ధమని ప్రకటించారు. జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ మంటలు పీక్స్‌కి చేరాయి. జీవోను నిరసిస్తూ జగిత్యాల-నిజామాబాద్‌ హైవేపై రైతులంతా ధర్నాకు దిగారు. జీవోకు వ్యతిరేకంగా నినదించారు.

ఇండస్ట్రియల్ జోన్స్‌ నుంచి తమ భూముల్ని రక్షించాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు భారీగా మోహరించారు. పంటలు పండే భూముల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని.. పదవులకు రాజీనామాతో పాటు అవసరమైతే ప్రాణాలు వదులుకునేందుకైనా సిద్ధమన్నారు సర్పంచ్‌లు.

ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీయొద్దంటున్నారు రైతులు. ఉప్పర్‌పేట, నర్సింగాపూర్‌, మోతే, తిప్పన్నపేట, దరూర్‌ గ్రామాల ప్రజలు కూడా ఆందోళనలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ జీవో వెనక్కి తీసుకోవాలని.. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు రైతులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం