AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవేం కష్టాలు.. ఉపాధి కూలీలకు వింత ‘ఫేస్’ పరీక్ష.. బొగ్గు రాసుకుంటేనే పని..!

ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పేరుతో అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ విధానం గ్రామీణ కూలీలకు కొత్త తలనొప్పిగా మారింది. కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ ముఖాన్ని గుర్తించకపోవడంతో కూలీలు నానా కష్టాలు పడుతున్నారు. ఎండలో గంటల తరబడి కష్టపడే ఉపాధి కూలీలు ఇప్పుడు పనికంటే ముందు ఓ పరీక్ష పాస్ కావాల్సి వస్తోంది. ఈ పరీక్ష పాస్ రావడానికి కూలీలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ఇవేం కష్టాలు.. ఉపాధి కూలీలకు వింత 'ఫేస్' పరీక్ష.. బొగ్గు రాసుకుంటేనే పని..!
Vbg Ramg Scheme
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 04, 2026 | 9:35 AM

Share

ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పేరుతో అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ విధానం గ్రామీణ కూలీలకు కొత్త తలనొప్పిగా మారింది. కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ ముఖాన్ని గుర్తించకపోవడంతో కూలీలు నానా కష్టాలు పడుతున్నారు. ఎండలో గంటల తరబడి కష్టపడే ఉపాధి కూలీలు ఇప్పుడు పనికంటే ముందు ఓ పరీక్ష పాస్ కావాల్సి వస్తోంది. ఈ పరీక్ష పాస్ రావడానికి కూలీలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

వీబీ జీరాంజీ పథకంలో హాజరు కూలీలకు ఇబ్బందిగా మారింది. ఫేస్ రికగ్నైజేషన్ హాజరు ప్రక్రియ నేపథ్యంలో మొదట తీసుకున్న ఫొటో ఆధారంగానే హాజరుకు యాప్ అంగీకరిస్తోంది. దీంతో కూలీలకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. హాజరు నమోదు కోసం టెక్నాలజీ పెడుతున్న టార్చర్ తో కూలీలు ఎన్నో ప్రయత్నాల తర్వాతే హాజరు నమోదు చేసుకుంటున్నారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం బొప్పారంకు చెందిన ఎడ్ల వెంకటేష్ ఉపాధి కూలీగా పనిచేస్తున్నాడు. ఉపాధి హామీ పథకం ఫేస్ రిగ్నైజేషన్ నమోదు సమయంలో గడ్డంతో ఫొటో తీసుకున్నారు. ఈ క్రమంలో గడ్డం గీయించుకుని ఉపాధి పనికి వెళ్లాడు. గంటల తరబడి ఎండలో పనిచేసిన వెంకటేష్.. పని పూర్తయ్యాక మేట్ యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్ కోసం కూలీలు ఫొటోలు తీస్తుండగా వెంకటేష్ ఫొటో అప్‌లోడ్ కావడం లేదు. దీంతో పలుమార్లు ప్రయత్నించినా.. అప్‌లోడ్ కాలేదు. హాజరు నమోదు కాకపోతే ఆ రోజు కూలీ రాదనే భయం వెంకటేష్ కు పట్టుకుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. ఫేస్ రిగ్నైజేషన్ నమోదు సమయంలో గడ్డంతో ఫొటో మాదిరిగా ఉంటేనే ఫొటో తీసుకుంటుందన్న విషయం వెంకటేష్ తెలుసుకున్నాడు. ఇందుకోసం బొగ్గు తీసుకుని గదమ చుట్టూ గడ్డం మాదిరి నల్లగా గీసుకోవడంతో ఫొటో యాప్ లో అప్ లోడ్ అయింది.

నెట్‌వర్క్ సమస్యలు, పాత మొబైల్ ఫోన్లు, కెమెరా నాణ్యత లేకపోవడం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. అధికారులు మాత్రం యాప్ ద్వారానే హాజరు తప్పనిసరి చేయడంతో ప్రత్యామ్నాయం లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఆధునిక సాంకేతికత సౌలభ్యం కల్పించాల్సింది పోయి… కూలీలను అవస్థలకు గురిచేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కొత్త స్టీల్ బ్రిడ్జి.. ఈ నలుగురిలో ఎవరు పేరు పెడతారో?
కొత్త స్టీల్ బ్రిడ్జి.. ఈ నలుగురిలో ఎవరు పేరు పెడతారో?
అసలు క్రికెట్ హిస్టరీలో ఎన్ని రకాల డకౌట్స్ ఉన్నాయో తెలిస్తే షాకే.
అసలు క్రికెట్ హిస్టరీలో ఎన్ని రకాల డకౌట్స్ ఉన్నాయో తెలిస్తే షాకే.
ఇంటి ముందు కారు పార్కింగ్‌కు రూ. 25 వేలు చెల్లించాల్సిందే!
ఇంటి ముందు కారు పార్కింగ్‌కు రూ. 25 వేలు చెల్లించాల్సిందే!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు..
బంగారం లాంటోడిని బండరాయిలా మార్చింది మీ ముగ్గురే..: మాజీ ప్లేయర్
బంగారం లాంటోడిని బండరాయిలా మార్చింది మీ ముగ్గురే..: మాజీ ప్లేయర్
ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం!
ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం!
విదుర నీతి: జీవితంలో ఈ విషయాలను ఎవరికీ చెప్పకండి.. చెబితే సమస్యలు
విదుర నీతి: జీవితంలో ఈ విషయాలను ఎవరికీ చెప్పకండి.. చెబితే సమస్యలు
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్ల విధులు.. ఇదేం తీరు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్ల విధులు.. ఇదేం తీరు..
విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!
విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!
ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?
ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?