రోడ్డు పక్కన దాబాలో ఏదో తేడాగా కనిపించింది.. ఆగి చెక్ చేసిన పోలీసులు షాక్..!

తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మత్తు రాక్షసి కోరలు చాస్తూనే ఉంది. నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు మత్తు దావానంలా వ్యాపిస్తోంది. తాజాగా నల్గొండ జిల్లా చిట్యాలలో డ్రగ్స్ కలకలం రేపింది. దాబా ముసుగులో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న యజమానినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

రోడ్డు పక్కన దాబాలో ఏదో తేడాగా కనిపించింది.. ఆగి చెక్ చేసిన పోలీసులు షాక్..!
Drugs In Dhaba

Edited By:

Updated on: Jan 10, 2026 | 8:10 PM

తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మత్తు రాక్షసి కోరలు చాస్తూనే ఉంది. నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు మత్తు దావానంలా వ్యాపిస్తోంది. తాజాగా నల్గొండ జిల్లా చిట్యాలలో డ్రగ్స్ కలకలం రేపింది. దాబా ముసుగులో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న యజమానినీ పోలీసులు అరెస్ట్ చేశారు. దాబా యజమాని నుండి 9కిలోల ఓపీఎం పాపి హస్క్ పౌడర్, ఆరు వేల రూపాయల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన గుర్మీత్ సింగ్ దాబా నిర్వహిస్తున్నాడు. దాబా నిర్వహణతో ఆశించిన లాభాలు రాకపోవడంతో అడ్డదారులు తొక్కుతున్నాడు. దాబా ముసుగులో డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నాడు. ఉత్తర భారతదేశం నుండి వచ్చే వాహనాల ద్వారా ఓపీఎం పాపి హస్క్ పౌడర్‌ను కొనుగోలు చేసి స్థానికంగా లారీ డ్రైవర్లకు, డ్రగ్స్‌కు అలవాటు పడిన వారికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ విషయం ఈగల్ టీమ్‌కు తెలియడంతో చిట్యాల పోలీసులతో కలిసి సంయుక్తంగా దాబాపై దాడి చేశారు. పోలీసుల తనిఖీల్లో డ్రగ్స్ బయటపడ్డాయి.

దాబా నిర్వాహకుడి నుంచి పెద్ద ఎత్తున వివిధ రకాల డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓపీఎం పాపి హస్క్ అనే మాదక ద్రవ్యానికి చెందిన పౌడర్ కిలో 1,800 రూపాయల చొప్పున గురుమిత్ సింగ్ కొనుగోలు చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. లారీ డ్రైవర్లకు కిలో 6,000 రూపాయలకు విక్రయిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా లారీ డ్రైవర్లు ఈ పౌడర్ ని కొనుగోలు చేస్తున్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు. మొత్తం 20 కిలోల ఓపీఎం హస్క్ పౌడర్ ను కొనుగోలు చేసినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని ఈ మాట ద్రవ్యానికి చెందిన పౌడర్ ఏ ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నాడో అనే విషయాలపై దర్యాప్తు చేస్తామని నల్లగొండ డీఎస్పీ శివరామిరెడ్డి చెబుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..