Kitex Garments: కేరళ కేంద్రంగా కార్యకలపాలు సాగిస్తున్న ప్రముఖ టెక్స్‌టైల్ సంస్థ కైటెక్స్ తాజాగా కొత్త ప్రాజెక్టును లాంచ్ చేసేందుకు సిద్ధమయింది. మొత్తం రూ. 3500 కోట్ల అంచనాతో ప్రారంభించనున్న ఈ కొత్త ప్రాజెక్టు కోసం సొంతూరు అయిన కేరళను కాదనుకుని తెలంగాణవైపు మొగ్గు చూపడం విశేషం. తెలంగాణలో పెట్టబడులు పెట్టే విషయమై చర్చించేందుకు కైటెక్స్ గ్రూప్ చైర్మన్ సాయి జాకబ్ శుక్రవారం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు కొచ్చిన్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని సైతం ఏర్పాటు చేసింది. వరంగల్‌లోని కాకతీయ మెగా జౌళి పార్కులో దుస్తుల పరిశ్రమను స్థాపించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా జాకబ్ మాట్లాడుతూ.. రానున్న రెండేళ్లలో దుస్తుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తానమి, దీని ద్వారా నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో తొలుత రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఇక కైటెక్స్ కంపెనీ నేపథ్యానికి వస్తే.. ఈ సంస్థను కేరళలో 1992లో కేరళలో ఏర్పాటు చేశారు. కైటెక్స్‌కు కేరళ, తమిళనాడుతో పాటు అమెరికాలోనూ పరిశ్రమలున్నాయి. ఈ సంస్థ చిన్నారుల దుస్తులను తయారు చేసే రెండో అతిపెద్ద పరిశ్రమగా పేరు సంపాదించుకుంది. ఈ సంస్థ తమ ఉత్పత్తులను ప్రపంచంలోని 15 దేశాలకు ఎగుమతి చేస్తుండడం విశేషం.
ఇదిలా ఉంటే కొత్త ప్రాజెక్టును సొంతూరు కేరళ కాకుండే తెలంగాణలో ఏర్పాటు చేయడానికి కేరళ ప్రభుత్వ తీరే కారణంగా తెలుస్తోంది. నిజానికి కొచ్చిన్ సమీపంలో ఈ పరిశ్రమను స్థాపించాలని కైటెక్స్ భావించింది. ఇందులో భాగంగానే కేరళ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే.. ఇప్పటికే కేరళలో ఉన్న కైటెక్స్ గ్రూప్ కంపెనీలపై అధికారులు అదేపనిగా తనిఖీలు చేపడుతుండడంతో కైటెక్స్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేరళలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఏ మాత్రం లేవని జాకబ్ ఆరోపించడం గమనార్హం. ఇక కైటెక్స్ పరిశ్రమను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతో పాటు మొత్తం తొమ్మిది రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని జాకబ్ చెప్పుకొచ్చారు.
కైటెక్స్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేయడం పట్ల తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్‌తో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసిన కేటీఆర్.. ‘ప్రపచంలోనే రెండో అతిపెద్ద వస్త్ర పరిశ్రమ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనుందని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. వరంగల్‌లోని కాకతీయ మెగా జౌళి పార్కులో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు’. వెంటనే నిర్ణయం తీసుకున్న సంస్థ చైర్మన్ జాకబ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Delighted to announce the entry of KITEX group, world’s 2nd largest manufacturer of kids apparel into Telangana with an initial investment of ₹1,000 Cr
They’ve chosen KMTP, Warangal for their factories
My gratitude to Mr. Sabu M. Jacob, MD of KITEX group on a quick decision ? pic.twitter.com/CgMf67DpxN
— KTR (@KTRTRS) July 9, 2021
Baahubali: ఆరేళ్ళ బాహుబలి.. అమరేంద్ర బాహుబలి అదిరిపోయే ఫోటో షేర్ చేసిన పాన్ ఇండియా స్టార్
Snapdragon Insider: మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంత ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.