Telangana Terror Links: తెలంగాణలో ఉగ్రలింకులు.. యువకుడిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

దేశవ్యాప్తంగా ఉగ్రలింకులపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే.. పలుప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు .. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.. అయితే.. తెలంగాణలో ఉగ్రలింకులు కలకలం రేపాయి.. నిజామాబాద్​జిల్లా బోధన్​ పట్టణంలోని అనుమానిత ప్రాంతాల్లో బుధవారం ఢిల్లీ స్పెషల్ సెల్​పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Telangana Terror Links: తెలంగాణలో ఉగ్రలింకులు.. యువకుడిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
Terror Links In Nizamabad

Updated on: Sep 11, 2025 | 2:00 PM

దేశవ్యాప్తంగా ఉగ్రలింకులపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే.. పలుప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు .. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.. అయితే.. తెలంగాణలో ఉగ్రలింకులు కలకలం రేపాయి.. నిజామాబాద్​జిల్లా బోధన్​ పట్టణంలోని అనుమానిత ప్రాంతాల్లో బుధవారం ఢిల్లీ స్పెషల్ సెల్​పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బోధన్ పట్టణానికి చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎడపల్లి పోలీస్​స్టేషన్లో విచారణ జరిపారు.. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకుని తమ వెంట తీసుకెళ్లారు. అయితే.. బోధన్‌ ఉగ్రలింకుల కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.. బోధన్‌కు చెందిన యామన్‌ బీ-ఫార్మసీ చదువుతున్నట్లు సమాచారం.. యామన్ ఇటీవల ఝార్ఖండ్‌ లో అరెస్ట్ చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది డానిష్‌తో యామన్‌ చాటింగ్‌, వీడియో కాల్‌ మాట్లాడినట్లు నిర్ధారించారు. ఇతర దేశస్తులతోనూ యామన్ మాట్లాడినట్టు గుర్తించారు. కృష్ణజింకను చంపిన కేసులో యామన్‌ తండ్రి నిందితుడిగా ఉన్నాడు..

డానిష్‌ను విచారిస్తున్న క్రమంలోనే బోధన్‌ యువకుడి పేరు బహిర్గతమైనట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డానిష్ ఇచ్చిన సమాచారంతో.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. అంతకుముందు కూడా బోధన్ లో ఉగ్రలింకులు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.. దీంతో ఒక్కసారిగా కలకలం రేపింది. కాగా.. ఇవాళ దేశవ్యాప్తంగా ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..