Hyderabad: ఏంట్రా బాబు ఇంత ఆగంగా ఉన్నారు.. ఇలా అయితే జల్ది ప్యాకప్ అంతే..
హైదరాబాద్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల మెరుపుదాడులు. బంజారాహిల్స్, గచ్చిబౌలి, మేడిపల్లి, ఏఎస్‌రావు నగర్‌లోని ఏబీ బార్బిక్యూ ఔట్‌లెట్లలో అపరిశుభ్రత, కాలం చెల్లిన ఆహారం బయటపడింది. బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్న స్టోర్‌రూమ్‌లు, కుళ్లిన ఫ్రూట్స్ సర్వ్ చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల మెరుపుదాడులు కలకలం రేపాయి. బంజారాహిల్స్, గచ్చిబౌలి, మేడిపల్లి, ఏఎస్‌రావు నగర్‌లోని ఏబీ బార్బిక్యూ ఔట్‌లెట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, స్టోర్‌రూమ్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతుండటం గుర్తించారు. కుళ్లిన ఫ్రూట్స్‌ను సర్వ్ చేయడం, మేడిపల్లి ఔట్‌లెట్‌లో కాలం చెల్లిన ఆహారం ఉంచడం వంటి లోపాలు బయటపడ్డాయి. నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి, శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు, నగరంలోని ఇతర హోటళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

