Munugode By Poll: మంత్రి ఎర్రబెల్లి మ్యాజిక్.. ఉపఎన్నిక బరి నుంచి 13 మంది ఇండిపెండెంట్లు క్విట్

|

Oct 17, 2022 | 5:10 PM

మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.

Munugode By Poll: మంత్రి ఎర్రబెల్లి మ్యాజిక్.. ఉపఎన్నిక బరి నుంచి 13 మంది ఇండిపెండెంట్లు క్విట్
Errabelli Dayakar
Follow us on

మునుగోడు బైపోల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో పదమూడు మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకున్నారు. ఆదివారం 10 మంది, నేడు ముగ్గురు తాము ఉపఎన్నిక నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.  TRS విజయం కోసం పనిచేస్తామని ప్రకటించారు. మునుగోడు ప్రచారానికి వెళ్లిని మంత్రి ఎర్రబెల్లి…ఎన్నికల బరిలో ఉద్యమకారులు, పలు పార్టీల సంస్థల ప్రతినిధులు నామినేషన్లు వేశారని తెలుసుకుని నేరుగా వారిని పిలిపించి మాట్లాడారు. వాళ్ల సమస్యలు విన్న మంత్రి…టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని, మంత్రి కేటీఆర్‌తో కలిపించి, గౌరవం దక్కేలా చూస్తామని హామీ ఇవ్వడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. మునుగోడు ఉపఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న పదిమంది యువకులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందించారు. త్వరలో సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బీజేపీ స్వార్థపూరిత రాజకీయాలకు పరాకాష్టగా ఈ మునుగోడు బైపోల్‌ వచ్చిందన్నారు బరిలోనుంచి తప్పుకున్న స్వతంత్ర అభ్యర్థి, కేయూ జేఏసీ అధ్యక్షుడు వినోద్‌కుమార్‌.

ముగిసిన ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ

ముగిసిన మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది.  36 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మెుత్తం 83 నామినేషన్లలో 36 ఉపసంహరణ అయ్యాయి.  ఉపఎన్నికల బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు.

ప్రచారం జోరు పెంచిన పార్టీలు

మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. మునుగోడు నుంచి ఫ్లోరైడ్‌ రక్కసిని తరిమికొట్టింది కేసీఆరేనన్నారు మంత్రి హరీష్‌రావు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో విద్వేషాన్ని పెంచడం తప్ప చేసిందేమి లేదన్నారు.ఈ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో మునుగోడు ప్రజలు ఆలోచించాలని హరీశ్‌ రావు పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజల కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌. దళితుల ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలిచి బీజేపీ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. మునుగోడు అభివృద్ధికి వెయ్యి కోట్ల నిధులు రాజగోపాల్‌ ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు మంత్రి తలసాని.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..