తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో మరో 3 రోజులు వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

Telugu states weather forecast : తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని.. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఏవి ఉండవని తెలిపింది.

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో మరో 3 రోజులు వర్షాలే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!
Telugu States Weather Forecast

Updated on: Jun 15, 2026 | 3:33 PM

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. జూన్ 15 ఉదయానికే.. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు, అలాగే తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లలోని మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు విస్తరించాయని.. ఇవి హర్నై, షోలాపూర్, హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, ఫూల్బాని, రాంచీ, జముయి, ముజఫర్‌పూర్ గుండా వెళ్తాయని పేర్కొంది. రాబోయే 4-5 రోజులల్లో ఈ నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్రలలోని మరికొన్ని ప్రాంతాలకు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లలోని మిగిలిన ప్రాంతాలకు, అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

వీటి ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రేపు, రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని.. అలాగే గరిష్ట ఉష్ణోగ్రల్లో రానున్న మూడు రోజుల పాటు పెద్దగా మార్పు ఉండదని స్పష్టం చేసింది. అంతేకాకుండా వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని తెలిపింది.

ఏపీలో వాతావరణం ఇలా

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా అటు ఏపీకి కూడా వాతావరణ వాఖ వర్ష సూచన జారీ చేసింది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఒడిశా ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీనపడిందని.. అలాగే బంగాళాఖాతం మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయాలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడ్రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. అలాగే వర్షం సమయండో గంటకు 30-40 కిలీ మీటర్ల వేగంలో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us