Telangana: నేపాల్ అమ్మాయి.. నకిరేకల్ అబ్బాయి.. మూడుముళ్ళతో బంధంతో ఒక్కటయ్యారు..

ప్రేమకు సరిహద్దులు, భాష, సంప్రదాయాలు… అడ్డు కావని మరోసారి నిరూపించింది ఓ జంట. నేపాల్ యువతితో ప్రేమలో పడ్డాడు మన కుర్రోడు. విదేశాల్లో వారి మనసులు కలిశాయి. దీంతో ఇండియాకు వచ్చి మూడుముళ్లతో ఒకటయ్యారు. ఈ ప్రేమ జంట గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: నేపాల్ అమ్మాయి.. నకిరేకల్ అబ్బాయి.. మూడుముళ్ళతో బంధంతో ఒక్కటయ్యారు..
Rajesh - Sujataha Tapa

Edited By: Kulbeer Singh Negi

Updated on: Nov 17, 2025 | 2:00 PM

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన బాచుపల్లి రాజేష్.. హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్ చదివాడు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి ఓ సంస్థలో పని చేస్తున్నాడు. ఇదే సమయంలో నేపాల్ రాజధాని ఖాట్మండుకు చెందిన సుజాత తప కూడా హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. రాజేష్ పనిచేస్తున్న సంస్థలోనే సుజాత తప కూడా పనిచేస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి పెళ్లి పట్ల ఇరు కుటుంబాల్లో కొంత వ్యతిరేకత కూడా వచ్చింది. దీంతో రాజేష్, సుజాత తప కొంతకాలం కెనడాలో పనిచేశారు. ఇటీవలే ఇద్దరు ఇండియాకు వచ్చారు. తమ పెళ్లికి ఇరు కుటుంబాలను ఒప్పించారు. నకిరేకల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ ప్రేమ జంట..విశ్వాసం, ప్రేమ ఆధారంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో స్థానిక వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సంప్రదాయబద్ధంగానూ పెళ్లి చేసుకున్నారు.

కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు, స్నేహితుల శుభాకాంక్షల మధ్య వీరి వివాహం సంతోషకర వాతావరణంలో జరిగింది. దీంతో రాజేష్, సుజాత తప.. మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ప్రేమ, పరస్పర గౌరవంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన రాజేష్, సుజాతల దంపతులకు అన్ని విధాలా శుభం కలగాలని బంధుమిత్రులు కోరుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.