Goli Soda: బాప్‌రే.. సింగరేణి ప్రజల ఆరోగ్య రహస్యం గోలి సోడానా! ఇప్పటికీ తగ్గని క్రేజ్..

| Edited By: Srilakshmi C

Aug 08, 2023 | 1:05 PM

కార్పొరేట్ సంస్థలు వివిధ రకాల బ్రాండ్లతో మార్కెట్లోకి కొత్త కొత్త పానీయాలను ప్రవేశపెట్టడంతో గోలి సోడాకు కొంతమేర గిరాకి తగ్గినప్పటికీ, మార్కోట్లోకి ఎన్ని బ్రాండ్లు వచ్చినా. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ గోలి సోడాతో ఉన్న అనుబంధాన్ని మాత్రం తెంచుకోలేకపోతున్నారు సోడా ప్రియులు. అంతే కాదు ప్రతి ఇంటి ఇంటికి వెళ్తాయి గోలి సోడా బండ్లు...

Goli Soda: బాప్‌రే.. సింగరేణి ప్రజల ఆరోగ్య రహస్యం గోలి సోడానా! ఇప్పటికీ తగ్గని క్రేజ్..
Goli Soda
Follow us on

రామగుండం, ఆగస్టు 8: కోల్ బెల్ట్ ప్రాంతంలో ఆ పేరు వింటే ఒక ఎమోషన్.. సోడా కొట్టేటప్పుడు వచ్చే శబ్దాన్ని కూడా కొంతమంది ఆనందంతో ఆస్వాదిస్తారు. సేద తీర్చుకునేందుకు ఎన్ని రకాల పానీయాలు తాగినా సోడా తాగితే వచ్చే కిక్కే వేరబ్బా అంటుంటారు సోడా ప్రియులు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని కోల్ బెల్ట్ ఏరియాతో గోలి సోడాకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ప్రకృతికి విరుద్ధంగా భూగర్భంలోకి వెళ్లి బొగ్గును ఉత్పత్తి చేసే సింగరేణి కార్మికులు గోలి సోడా అంటే అమితంగా ఇష్టపడు తుంటారు. కోల్ బెల్ట్ ప్రాంతమంతా పరిశ్రమలకు నిలయంగా మారడంతో, అక్కడ వాతావరణ కాలుష్యం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

దీంతో స్థానికులు జీర్ణ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ సమస్యకు గోలి సోడా ఒక్కటే చక్కటి పరిష్కారమని భావిస్తున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు ఒక గోలి సోడాను సేవిస్తే రిలీఫ్ గా ఉంటుందంటున్నారు సోడాప్రియులు. అయితే , కార్పొరేట్ సంస్థలు వివిధ రకాల బ్రాండ్లతో మార్కెట్లోకి కొత్త కొత్త పానీయాలను ప్రవేశపెట్టడంతో గోలి సోడాకు కొంతమేర గిరాకి తగ్గినప్పటికీ, మార్కోట్లోకి ఎన్ని బ్రాండ్లు వచ్చినా. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ గోలి సోడాతో ఉన్న అనుబంధాన్ని మాత్రం తెంచుకోలేకపోతున్నారు సోడా ప్రియులు. అంతే కాదు ప్రతి ఇంటి ఇంటికి వెళ్తాయి గోలి సోడా బండ్లు.

మధ్యహ్నం, రాత్రి తిన్న తరువాత గోలి సోడా తాగాల్సిందే. సింగరేణి కార్మికుల తో పాటు కుటుంబ సభ్యులు తాగుతారు. అంతే కాదు.. వీరికి ఉద్దెర ఇస్తారు. జీతం పడిన తరువాత వసూల్ చేసుకుంటారు. ఇందులో నిమ్మకాయతో పాటు సాధ సోడా ఉంటుంది. నిమ్మకాయ సోడాను ఎక్కువగా తాగుతున్నారు. సింగరేణి పని తరువాత బొగ్గు భావి దగ్గరే కార్మికులు గోలి సోడా తాగుతున్నారు. అంతేకాదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు కూడా గోలి సోడా తాగాల్సిందే. కొంత మంది గోలి సోడా కోసమే రామగుండం వస్తున్నారు. గోలి సోడా తో పలువురు ఉపాధి పొందుతున్నారు. సింగరేణి లో మినహా.. ఎక్కడ కూడా గోలి సోడాలు కనఁబడవు. గ్యాస్ తో పాటు నిమ్మ కాయను మిక్స్ చేసి సీసా లో నింపుతారు. మళ్ళీ అందరికీ గోలి సోడా కొట్టడం రాదు. సౌండ్ కూడా వెరీటి గా ఉంటుంది. మీకు గోలి సోడా తాగాలంటే రామగుండంకు రావాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.