Telangana Weather Report: తెలంగాణ వాతావరణ సమాచారం.. రాగల మూడు రోజులు చలి తీవ్రత తగ్గే అవకాశం..

|

Jan 13, 2021 | 7:51 PM

Telangana Weather Report: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం..

Telangana Weather Report: తెలంగాణ వాతావరణ సమాచారం.. రాగల మూడు రోజులు చలి తీవ్రత తగ్గే అవకాశం..
Weather Report
Follow us on

Telangana Weather Report: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు నివేదికను విడుదల చేశారు. రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా తూర్పు, ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయన్నారు. ఫలితంగా చలి తీవ్ర కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. అయితే ఈ చలి తీవ్రంగా క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ రోజు, గురువారం నాడు తెలంగాణలోని జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉందిని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు.

కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. తెల్లవారుజామున చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో అందరూ తమ తమ ఊళ్లకు వెళుతండగా, ఉదయం వేళ దట్టమైన పొగ మంచు రహదారులను కమ్మేస్తోంది. దాంతో వాహనదారులు తీవ్ర అవస్థులు పడుతున్నారు. ఎదరుగా ఏ వాహనం ఉందో.. మరే వాహనం వస్తుందో అర్థం కాక తిప్పలుపడుతున్నారు. ఇక అటవీ ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చలి తీవ్రత బీభత్సంగా ఉంటోంది. ఉదయం 10 గంటల వరకు కూడా మంచు తెరలు వీడటం లేదు.

Also read:

అయ్యప్ప శరణుఘోషతో పులకిస్తున్న శబరిగిరులు, మరికొన్ని గంటల్లోనే మకరజ్యోతి దర్శన భాగ్యం, టీవీ9 లో ప్రత్యక్షప్రసారం

COVID-19 Vaccination : ఎల్లుండి కరోనా టీకా పంపిణీకి ఏపీలో సర్వం సిద్ధం, గన్నవరం నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ తరలింపు