Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో దంచికొట్టుడే

ఇక.. ఏపీ, తెలంగాణను వరుసగా అల్పపీడనాలు, ఆవర్తనాలు వెంటాడుతున్నాయి. కొన్ని నెలలుగా గ్యాప్‌ల వారీగా వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పుడు మరోసారి అల్పపీడనం, ఆవర్తనాలతో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక IMD ఇచ్చినా వెదర్ అప్‌డేట్‌ చూస్తే ఇలా ఉంది.

Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో దంచికొట్టుడే
Rain Alert

Updated on: Oct 02, 2025 | 8:18 AM

ఉత్తర వాయువ్యదిశలో కదిలి దక్షిణ ఒడిస్సా ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో రేపు తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు(గురువారం), రేపు(శుక్రవారం) తెలంగాణలోని అన్ని జిల్లాలకు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ తేలికపాటి ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా.. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌, జనగామ, వరంగల్‌, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, హైదరాబాద్‌.. ఈ 14 జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక.. హైదరాబాద్‌ను వీడేదేలేదంటోంది వాన.

ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా

మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి.. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం అరెంజ్‌ అలర్ట్‌ జారీ అయింది. ఈ ఏడు జిల్లాల్లో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌.. ఏలూరు, అల్లూరి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ చేసింది. ఈ 10 జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే చాన్స్‌ ఉందన్నారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: చేసినవి 27 మూవీస్.. కానీ హిట్స్ మాత్రం రెండు.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అరాచకం చూస్తే