CM KCR: దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు ఇస్తాం: సీఎం కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు కూడా ఇస్తామని స్పష్టం చేశారు..

CM KCR: దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు ఇస్తాం: సీఎం కేసీఆర్‌
Cm Kcr

Updated on: Feb 10, 2023 | 11:53 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. గుత్తికోయలు చాలా ఆటవికంగా ప్రవర్తిస్తున్నారని, అటవీ అధికారి శ్రీనివాసరావును చంపడం కరెక్టేనా.. పోడు భూముల సమస్య న్యాయమైన డిమాండ్‌ అని, రాష్ట్రంలో 11 లక్షల పోడు భూముల పట్టాలు ఇస్తామని అన్నారు. ఈ నెలలోనే పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇది ఎన్నికల కోసం చేసే దందా కాదని, పోడు భూములంటే దురాక్రమణే, అడవులన్నీ నరికేయడం సరైంది కాదన్నారు. ప్రతిసారీ దీనిపై రాజకీయం చేయడం అలవాటైపోయిందని అన్నారు. గత ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు.

తెలంగాణలో గ్రీన్‌ కవర్‌ 7.8కి పెరిగిందని అన్నారు. ఇప్పుడు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామని, కానీ ఇదే విధంగా కొనసాగడం కరెక్ట్‌ కాదని, దీనికి ముగింపు రావాలన్నారు. మళ్లీ అటవీ భూములను ధ్వంసం చేస్తే పట్టాలు వెనక్కి తీసుకుంటామన్నారు. అలాగే భూమి లేని వారికి గిరిజన బంధు ఇస్తామని సభలో స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌.

ఇవి కూడా చదవండి