Etela: ప్రపంచంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ.. ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

|

Sep 14, 2021 | 4:11 PM

సెప్టెంబర్ 17ను అధికారికంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రపంచంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ జాతి అన్నారు.

Etela: ప్రపంచంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ.. ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Etela Rajendar
Follow us on

Etela Rajendar: సెప్టెంబర్ 17ను అధికారికంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రపంచంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ జాతి అన్నారు. గతంలో అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశానని, ఇందుకు సీఎం కేసీఆర్ కూడా గళమెత్తి ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. ఆనాడు నైజాం నుంచి విముక్తి సాధించిన హైదరాబాద్‌లో భాగాలుగా ఉన్న మహారాష్ట్ర, కర్నాటకలో విలీనమైన ప్రాంతాల్లో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తున్నాయి. మనం మాత్రం జరపుకోకపోవడం అవమానకరమన్నారు. మనకు విముక్తి కల్పించిన ఆ రోజును అధికారికంగా గుర్తు చేసుకోవాల్సిందే అని ఈటల స్పష్టం చేశారు.

ప్రభుత్వం అధికారికంగా జరపకపోయినా.. టీఆర్ఎస్ కూడా పార్టీ కార్యాలయాలతో పాటు తెలంగాణ భవన్ మీద జాతీయ జెండా అవిష్కరణ జరిగిందని ఈటల గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ పార్టీ తరపున వాడవాడనా సెప్టెంబరు 17న విముక్తి వేడుకలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. మైమరిపించి, మాయ చేసే సంస్కృతి మనది కాదన్న ఈటల.. బరిగీసి కొట్లాడే సంస్కృతి కాదన్నారు. తెలంగాణ బిడ్డలకు స్ఫూర్తి ప్రధాతలు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలు. దేశానికి చైతన్యాన్ని అందించిన గడ్డ తెలంగాణ. వందేమాతర, గ్రంథాలయ ఉద్యమాలు కావచ్చు, సాయుధ పోరాటాలు కావచ్చు.. ఏ పార్టీ ఆధ్వర్యంలో జరిగినా.. అణచివేతకు, దోపిడికి, అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగినవే అని ఆయన గుర్తు చేశారు.

ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో రాజ్యం అనేక అకృత్యాలకు బలైంది. అందరి మీద రాజ్యం అప్పడు దుర్మార్గాలకు పాల్పడి, ఎందరినో చంపింది, మరెందరినో జైళ్లపాలు చేసింది. మొత్తం తెలంగాణ చరిత్ర పరిశీలిస్తే.. పోరాడేవాడికి, దుర్మార్గాలను ఎదిరించిన వాళ్లకే ఈ ప్రాంతం అండగా ఉంది. ఇప్పటికీ తెలంగాణ సమాజం ఈ తత్వాన్ని వదిలిపెట్టలేదు. ఏ రూపంలో ఉన్నా.. ఇక్కడ అమరత్వం, చైతన్యం దాగిఉందన్నారు. ఇప్పుడు రాజ్యం మళ్లీ.. ప్రజలను భయపెట్టి, అణచివేసే ప్రయత్నం చేస్తోంది. అనేక రకాలుగా ప్రలోభపెడుతోంది.

ఇలాంటి వాటి మధ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెనుగులాడుతున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు సైలెంట్ గా గమనిస్తున్నారు.. ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో అలాంటి ప్రతికారం తీర్చుకుంటారన్న ఈటల. తెలంగాణ ఉద్యమంలోనూ ఎవరూ చెప్పకపోయినా.. కులమతాలకు అతీతంగా అందరూ భాగస్వాములయ్యారు.

ఒక్క పార్టీ మాత్రమే ఉద్యమం చేస్తే ఇంతమంది కదిలేవారా? అది సకల జనుల ఉద్యమం, సకల పార్టీల ఉద్యమం. త్యాగమంటే చావుమాత్రమే కాదు.. ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటంలో పాల్గొనేవారికి అండగా ఉన్న ప్రజలు కూడా త్యాగధనులే. కేంద్రం.. రాష్ట్రం ఇవ్వకుండా ఉండలేని పరిస్థితికి వచ్చిందంటే… ప్రజల చైతన్యమే కారణం. గత చరిత్ర నుంచి గుణపాఠాలు తీసుకోనివారు, అవగాహన చేసుకోనివారే ఇలాంటి దురాగతాలకు పాల్పడుతారని మండిపడ్డ ఈటల. ఈ దౌర్జన్యాలు, దురాగతాలు, దుర్మార్గాలు ఇక్కడ చెల్లవని హుజురాబాద్ ప్రజలు చాటిచెప్పబోతున్నారన్నారు. అహంకారానికి కారణం అయిన పదవిని దింపడమే నిజమైన ప్రతీకారం. అందుకు హుజూరాబాద్ నాంది కాబోతుంది. సెప్టెంబర్ 17న నిర్మల్‌లో జరిగే అమిత్ షా సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చిన ఈటల రాజేందర్.

Read Also…  Mumbai News: నిద్ర మత్తులో టూత్‌పేస్టుకు బదులు ఎలుకల మందుతో పళ్ళు తోముకున్న యువతి.. చివరకు..