నిన్న అదొక మృత్యుసొరంగం.. నేడు రాజకీయ రణరంగం..! టన్నెల్‌ చుట్టూ తన్నులాట!

తెలంగాణ పునర్మిర్మాణాన్ని ఒక యజ్ఞంగా భావిస్తున్నా.. ఆ దిశగానే కష్టపడుతున్నా.. అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి దగ్గిర రాష్ట్రంపై తనదైన ముద్ర ఉండాలన్న తపన స్పష్టంగా కనిపిస్తుంది. మూసీ నదిని పునరుజ్జీవింప జేయడం.. రాజధానికి నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మించడం.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా రేవంత్‌రెడ్డి రిపీటెడ్‌గా చెబుతూ వస్తున్న వాగ్దానాలివి. కానీ... రేవంత్‌రెడ్డి ఛాలెంజ్‌గా తీసుకుని అమలుచేస్తున్న ఇటువంటి మానస పుత్రికలు ఇంకా చాలానే ఉన్నాయి. ఆ జాబితాలో మరొకటి ఎస్‌ఎల్‌బీసీ.

నిన్న అదొక మృత్యుసొరంగం.. నేడు రాజకీయ రణరంగం..! టన్నెల్‌ చుట్టూ తన్నులాట!
Congress Brs On Slbc

Updated on: Feb 27, 2025 | 9:55 PM

డ్యామ్స్ అండ్ పాలిటిక్స్.. మన జలాశయాలు-వాటికి పొంచి ఉన్న గండాలు.. అనే సబ్జెక్ట్ మీద మొన్నటిదాకా రాజకీయంగా పెద్ద చర్చే జరిగింది. దీనికి నేపథ్యం కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ డ్యామ్ కుంగడం. విచారణ కమిషన్ గేరు మార్చినట్టే.. పొలిటికల్ బ్లేమ్‌గేమ్ కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఇది చాలదా అన్నట్టు.. కొత్తగా యాడైన మరో చాప్టర్.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుంగుబాటు. దీని మీద రగులుతున్న రాజకీయరచ్చయితే వేరే లెవల్.. గాల్లో దీపాల్లా మిణుకు మిణుకుమంటున్న ఎనిమిది ప్రాణాలు.. దుర్ఘటన జరిగి వారం రోజులవుతున్నా వాళ్లసలు ఉన్నారో పొయ్యారో కూడా బైటికి చెప్పుకోలేని దైన్యత. NDRF, ఆర్మీ, నేవీ, SDRF, సింగరేణితోపాటు.. ఐఐటీ మద్రాస్‌, L&T టీమ్‌, జార్ఖండ్‌ మైనింగ్‌ టీమ్‌.. మొత్తం 9 రకాల బృందాలు SLBC దగ్గర మోహరించి.. ప్రతీ క్షణమూ విలువైనదిగా భావించి.. మొన్నటిదాకా యుద్ధప్రాతిపదికన సాగింది రెస్క్యూ ఆపరేషన్. కానీ.. అది చాలా రిస్కీ ఆపరేషన్‌గా మారిందని, లోపలికి మెషినరీ తీసుకెళ్లే మార్గం కూడా లేదని దాదాపుగా చేతులెత్తేసింది ప్రభుత్వం. అటు.. ప్రమాద స్ధలం పూర్తిగా బురదమట్టితో నిండిపోవడంతో.. SLBC టన్నెల్‌లో భయానక వాతావరణం నెలకొంది. టర్బో బోరింగ్‌ మిషన్‌ను విరగ్గొడితే గాని లోపలికి వెళ్లే ఛాన్స్ లేకపోవడం.. మట్టిపెళ్లలు నాన్‌స్టాప్‌గా ఊడిపడ్డం.. జియాలజీ నిపుణులు సైతం ఏమీ చెప్పలేకపోవడం.. ఇవన్నీ కలిపి రెస్క్యూ టీమ్స్‌ని ముందుకు కదలనివ్వడం లేదు. ఆ ఎనిమిది మంది ఎక్కడ ఉన్నారు? ప్రమాదస్థలికి అవతల...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి