Telangana: ఆర్టీసీ బస్సులో ప్రత్యక్షమైన మంత్రి పొన్నం.. ప్రయాణికులతో మాటమంతీ..

|

Mar 03, 2024 | 2:56 PM

ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. నారాయణ పెట్ బ్ససులో వెళ్తున్న బస్సులో ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నందిగామ నుంచి షాద్ నగర్ వరకు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంతో పాటు వెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి...

Telangana: ఆర్టీసీ బస్సులో ప్రత్యక్షమైన మంత్రి పొన్నం.. ప్రయాణికులతో మాటమంతీ..
Minister Ponnam Prabhakar
Follow us on

తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొతన్నం ప్రభాకర్‌ ఆర్టీసీ బస్సులో ఆకస్మిక ప్రయాణం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మంత్రి బస్సులో ప్రత్యక్షంకావడంతో ప్రయాణికులతో పాటు కండక్టర్‌, డ్రైవర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌ నగర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నాం ఆదివారం ఆకస్మికంగా ప్రయాణం చేశారు.

ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. నారాయణ పెట్ బ్ససులో వెళ్తున్న బస్సులో ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నందిగామ నుంచి షాద్ నగర్ వరకు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంతో పాటు వెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి కూడా బస్సులో ప్రయాణం చేశారు.

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న ఉచిత ప్రయాణం, ప్రయాణం వల్ల ఆదా అవుతున్న డబ్బులు తదితర వివరాలను మంత్రి బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోపు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసిలో ఉచిత ప్రయాణం, రూ. 10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ, రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఇక ఇదే నెలలో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి ప్రయాణికులతో తెలిపారు. ఈ క్రమంలోనే బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా… త్వరలోనే మరో వెయ్యి కొత్త బస్సులు వస్తున్నాయని ఎవరికి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. ఇక ఆర్టీసి కండక్టర్ తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా.. బాండ్స్ అమలు చేస్తున్నామని త్వరలోనే పీఆర్సీ అమలుకు చర్చిస్తున్నమని.. ఆర్టీసిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని మంత్రి సమాధానం ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..