Telangana Traffic Police: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్లపై వదిలి వెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. చాలా మంది రకరకాల కారణాల చేత తమ వాహనాలను రోడ్లపైనే వదిలి వెళ్తుంటారు. రోజులు గడుస్తున్నా వాటిని తీసుకెళ్లని వారు చాలా మంది ఉంటారు. అలాంటి వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా రోడ్డుపై వదిలి వెళ్లే కార్ల విషయంలో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. 15 రోజుల పాటు కారును రోడ్డుపై వదిలి వెళ్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి వాహనాలను సీజ్ చేసి భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రోజుల తరబడి రోడ్లపై వాహనాలను వదిలి వెళ్లొద్దని ట్రాఫిక్ పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు బీభత్సం సృష్టించిన దరిమిలా.. వాహనాలపై స్టిక్కర్లు ఉండటాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. వాహనాలపై ఎలాంటి స్టిక్కర్లు ఉండొద్దంటూ స్పష్టమైన ప్రకటన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు పెరుగుతున్న క్యూ..
పెండింగ్ చలన్ క్లియర్ చేసేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఈ సేవ, కంపౌండింగ్ బూత్ లో వాహనదారులు చలన్ క్లియర్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ. 250కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా చాలా మంది పెండింగ్ చలాన్లు చెల్లించేవారు ఉండటంతో.. ఆన్‌లైన్‌లో ఒత్తిడి పెరిగింది.
Also read:
TSTET 2022: టెట్ అభ్యర్థులూ బీ అలర్ట్.. టెట్ వెబ్‌సైట్‌లో పాత హాల్‌టికెట్లు..
Telangana: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..
Stuents Alert: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..