Telangana: మండే ఎండల నుంచి రిలీఫ్.. ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో గత మూడు రోజులుగా వాతావరణ పరిస్థితి మారింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా.. రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది. రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Telangana: మండే ఎండల నుంచి రిలీఫ్.. ఈ జిల్లాల్లో వర్షాలు
Rain Alert

Updated on: Apr 11, 2024 | 12:42 PM

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాడు. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. భానుడి భగభగలతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.  చాలా జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీలకు మధ్య ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. అయితే గత 3 రోజులుగా రాష్ట్రంల ఎండలు కొద్దిగా తగ్గాయి. పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. తాజాగా తెలంగాణకు మరోమారు కూల్ న్యూస్ చెప్పింది వెదర్ డిపార్ట్‌మెంట్. తెలంగాణలో గురువారం, శుక్రవారం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లోఉరుములు, మెరుపులు ఈదురు గాలులుతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉందని అంచనా వేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, భూపాలపల్లి,  పెద్దపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, వరంగల్, ములుగు, హనుమకొండ, కామారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట,  ఖమ్మం, జనగామ, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి,  మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేశారు.

కాగా ఎండలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని.. లేదంటే వడదెబ్బకు గరయ్యే అవకాశం ఉంటుందని.. అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 మధ్య బయటకు వెళ్లకపోతేనే మంచిదంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. టోపీ ధరించాలని, గొడుగు వినియోగించాలని చెబుతున్నారు. అలానే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మంచినీరు, ఓఆర్‌ఎస్ వంటివి తాగాలని చెబుతున్నారు. కాగా బుధవారం పాల్వంచ మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..