
TGSPDCL: తెలంగాణ దక్షిణ విద్యుత్ సరఫరా సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) మంగళవారం కీలక ప్రకటన చేసింది. విద్యుదాఘాత మరణాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని రూ. 8 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సంభవించిన మరణాలకు వర్తిస్తుంది.
గతంలో విద్యుదాఘాత మరణాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియా మొత్తం రూ. 5 లక్షలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని చట్టబద్ధమైన వారసుడికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ. 7.2 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా, రూ. 80,000ను నగదు రూపంలో చెల్లిస్తారు. అయితే జంతువుల విషయానికొస్తే, పశువులకు రూ. 40,000, మేకలు, గొర్రెలకు రూ. 7,000 చొప్పున మొత్తం ఇప్పటికీ ఉంది.
ఈ కీలక నిర్ణయం ద్వారా విద్యుత్ ప్రమాదాల్లో నష్టపోయిన సాధారణ వ్యక్తులు, రైతు కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. ప్రమాదం జరిగిన నిర్ణీత గడువులోగా బాధిత కుటుంబాలకు ఈ ఎక్స్‌గ్రేషియా సొమ్ము అందేలా చూడాలని సంబంధిత అధికారులను సంస్థ ఆదేశించింది.
TGSPDCL Enhanced Ex-gratia amount from Rs.5.00 Lakhs to Rs.8.00 Lakhs payable in a Fatal Accident resulting in death of a Non- Departmental persons owing to electrocution, with effect from 01.04.2026 onwards – Amendment – Orders – Issued pic.twitter.com/abYDqBzy4U
— IPRDepartment (@IPRTelangana) July 29, 2026
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి