Double Bedroom Scam: డబుల్ బెడ్ రూం ఇళ్ల కుంభకోణంలో కీలక మలుపు.. ఇప్పటివరకు పది మంది అరెస్టు

|

Oct 12, 2022 | 8:11 PM

మహబూబ్ నగర్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కుంభకోణం రోజుకో మలుపుతిరుతుంది. రోజురోజుకు బాధితుల సంఖ్య రెట్టింపు అవుతుంది. వీడియో రికార్డింగ్‌లతో సహా పోలీసులను ఆశ్రయిస్తున్నారు బాధితులు. వివరాల్లోకెళ్తే..

Double Bedroom Scam: డబుల్ బెడ్ రూం ఇళ్ల కుంభకోణంలో కీలక మలుపు.. ఇప్పటివరకు పది మంది అరెస్టు
Double Bedroom Scam
Follow us on

మహబూబ్ నగర్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కుంభకోణం రోజుకో మలుపుతిరుతుంది. రోజురోజుకు బాధితుల సంఖ్య రెట్టింపు అవుతుంది.  బాధితులు వీడియో రికార్డింగ్‌లతో సహా పోలీసులను ఆశ్రయిస్తున్నారు . వివరాల్లోకెళ్తే..

మహబూబ్‌నగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కుంభకోణంలో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అక్రమార్కుల చేతిలో మోసపోయిన బాధితులంతా పోలీస్ స్టేషన్‌కు వరుసగా ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో డబ్బులు ఇచ్చి మోసపోయామంటూ బాధితులు పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలంటూ పోలీసులను బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో బాధితులను మోసగించిన 15 మందిపై ఫిర్యాదులు చేశారు. మహబూబ్ నగర్ రూరల్, వన్ టౌన్ పీఎస్ లలో వీడియో రికార్డులతో సహా బాధితులు కంప్లైంట్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఇప్పటికే రెండు విడతల్లో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ అమాయకులైన పలువురి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన పది మందిని పోలీసులు విచారిస్తున్నారు. మిగతా ఐదుగురి కోసం గాలింపులు చేపట్టినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. మొదటి విడతలో నలుగురిని అరెస్ట్ చేశామని, వారిలో ప్రధాన నిందితుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత కార్యదర్శి కుమారుడు అక్షయ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 లక్షల 50 వేల నగదు వసూలు చేశారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజేశ్వర్ గౌడ్ చెప్పారు. రెండో విడతలో మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురిని అదుపులో తీసుకొనే పనిలో ఉన్నారు. డబుల్ బెడ్ రూం కుంభకోణంలో మోసపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.