Telangana TDP: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు నయా స్ట్రాటజీ!.. పూర్వ వైభవం దక్కేనా?

|

Jul 15, 2021 | 5:31 PM

Telangana TDP : టీడీపీ అధ్యక్షడు రాజీనామా చేసారు.. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వేటలో తెలుగుదేశం పడింది. ఉన్న లీడర్ల కూడా మాకు కావాలంటే.

Telangana TDP: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికలో చంద్రబాబు నయా స్ట్రాటజీ!.. పూర్వ వైభవం దక్కేనా?
Tdp
Follow us on

Telangana TDP : టీడీపీ అధ్యక్షడు రాజీనామా చేసారు.. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వేటలో తెలుగుదేశం పడింది. ఉన్న లీడర్ల కూడా మాకు కావాలంటే మాకు అంటూ అడుగుతున్నారట? ఓవైపు ఏమీ లేని పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇంత డిమాండ్ ఏంటి అనే చర్చ నడుస్తుంటే.. అందరిని సంతృత్తి పరిచే ఫార్ములాను బాబు అనుసరితారని మరో టాక్ నడుస్తోంది. ఇంతకీ టీటీడీపీలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం..

ఇప్పటి వరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ సైకిల్ వదిలేసి కార్ ఎక్కారు. దాంతో పార్టీకి ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని నియమించే పనిలో పడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇదే అంశంపై టీటీడీపీ నేతలతో చర్చలు జరిపిన బాబు ఇప్పుడు ఒక ఫార్ములా కనుకొన్నారట. ఇందులో భాగంగా నేతల మధ్య సమన్వయం కోసం కంభంపాటి రాంమోహన్ కు బాధ్యత అప్పగించారు బాబు. మరోవైపు అధ్యక్ష పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. దాంతో అందరినీ సంతృప్తి పరిచేలా అధ్యక్షుడిని నియామకానికి సంబంధించి చంద్రబాబు ప్లాన్ వేశారట.

ఇందులో భాగంగానే.. మొదట అధ్యక్ష పదవి కోసం రావుల చంద్రశేఖర్ రెడ్డిని అడిగారట. కానీ, పని ఒత్తిడి కారణంతో ఆయన వద్దని అనుకున్నారంటా. దీంతో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కిన నరసింహులు ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, అరవింద్ కుమార్ గౌడ్ కూడా తనకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారట. కానీ, బాబు మాత్రం బక్కిన నరసింహులు వైవు ఉన్నారని సమాచారం. ఎమ్మెల్యేగా పని చేయడం, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండడం.. పార్టీకీ విధేయత వంటి కారణాల చేత ఆయనవైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని టీడీపీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది.

కాగా, అధ్యక్ష పదవిపై ఆశ పెట్టుకున్న వారిని సంతృప్తి పరిచేందుకు ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్‌లను నియమించాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అధ్యక్ష నియామకానికి సంబంధించి శుక్రవారం నాడు ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలాఉంటే.. తెలంగాణలో ఇప్పటికే అనేక పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్షాల్లో ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొత్తగా దివంగత నేత వైఎస్ఆర్ తనయ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు. ఆమె కూడా అధికారం దిశగా పయనించేందుకు కసరత్తులు ప్రారంభించారు. ఇలా సాగుతున్న రాజకీయ చదరంగంలో టీటీడీపీ కొత్త టీమ్.. పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

Also read:

Hyderabad City: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన కేటుగాళ్లు.. నకిలీపత్రాలతో రూ. 1.39 కోట్ల మోసం.. షాక్ అయిన బ్యాంక్ మేనేజర్..

Hyderabad Rains: పేరుకే ‘భాగ్యనగరం’.. చిన్నపాటి వర్షం పడిందో ‘బాధల నగరమే’.. ఈ సమస్యలకు కారణాలేంటంటే..

Viral Video: పెంపుడు కుక్కలకు తనను తాను పరిచయం చేసుకున్న యువతి.. బిత్తరపోయి మొహాలు చూసుకున్న కుక్కలు..