AP-TS Politics: అసెంబ్లీ సీట్ల పెంపు వివాదం.. కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ వినోద్ కుమార్..

|

Jul 10, 2021 | 2:34 PM

AP-TS Politics: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు..

AP-TS Politics: అసెంబ్లీ సీట్ల పెంపు వివాదం.. కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ వినోద్ కుమార్..
Mp Vinod Kumar
Follow us on

AP-TS Politics: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. శనివారం నాడు ఇదే అంశంపై ఆయన టీవీ9 తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల పూర్తి వివక్ష ప్రదర్శిస్తుందన్నారు. కావాలనే కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడం లేదన్నారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడం లేదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచడం లేదో సమాధానం చెప్పాలి’ అని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల బీజేపీ తొలి నుంచి పక్షపాత వైఖరినే అవలంభిస్తోందన్నారు.

ఇదిలాఉంటే.. ఇదే అంశంపై రాజకీయ నిపుణులు రవి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 26 ఆర్టికల్ 173కి లోబడి తెలంగాణలో 153, ఆంధ్రప్రదేశ్లో 225 కి అసెంబ్లీ సీట్లు పెంచాలని నిర్దేశించారని ఆయన గుర్తుచేశారు. ఇదే అంశంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాశాయన్నారు. అయితే, ఆర్టికల్ 173 ప్రకారం 2026 వరకు సీట్లు పెంచడానికి వీలు లేదని కేంద్రం పార్లమెంట్‌కు చెప్పిందన్నారు. 2018లో వెంకయ్య నాయుడు చొరవతో కేబినెట్ నోట్ తయారు చేశారని, రాజ్యాంగ సవరణకు ప్రతిపాదించారని రవి గుర్తు చేశారు. అయితే, చంద్రబాబుతో రాజకీయ విభేదాల కారణంగా కేంద్రం ఆ ప్రక్రియను నిలిపివేసిందన్నారు. రాజకీయ కారణాలతోనే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ డీ లిమిటేషన్ చేయడం లేదని రవి విశ్లేషించారు. జమ్మూకశ్మీర్ లో సీట్లు పెంపు చేస్తున్నపుడు ఏపీ, తెలంగాణలో కూడా చేయాలన్నారు. జమ్మూకశ్మీర్ కోసం డీ లిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేశారు.. అదే కమిటీ తెలుగు రాష్ట్రాల్లో ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయొచ్చన్నారు. నియోజకవర్గాల పెంపుపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల స్టాండ్ ఏంటో తెలియాలని అన్నారు.

Also read:

Motorola One 5G UW Ace: మోటోరోలా నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!

TSGENCO: నాగార్జున సాగర్‌లో విద్యుదుత్పత్తి నిలిపివేసిన తెలంగాణ జెన్‌కో.. 11 రోజులు కొనసాగిన ఉత్పత్తి

MLA Jaggareddy: షర్మిల రాజకీయ పార్టీ సహా ఏపీ, తెలంగాణ నీటి వివాదాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి..