Huzurabad By Election: ‘సీఎంనే అంత మాట అంటావా? మరి నువ్వేంటి?’.. ఈటలపై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి హరీష్ రావు..

|

Oct 01, 2021 | 9:38 PM

Huzurabad Bypoll: హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి నీతి లేదు..

Huzurabad By Election: ‘సీఎంనే అంత మాట అంటావా? మరి నువ్వేంటి?’.. ఈటలపై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి హరీష్ రావు..
Harish Rao
Follow us on

Huzurabad Bypoll: హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి నీతి లేదు.. జాతి లేదంటూ ఈటల చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘అయ్యా నీకు నీతి లేదు.. జాతి లేదు..’ అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం భీమ్ పల్లి గ్రామంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధూమ్ ధామ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ ప్రసంగిస్తూ ఈటెలపై విరుచుకుపడ్డారు. నీతి లేనిది నీకు అంటూ ఈటెలను తూర్పారబట్టారు.

‘నీకు కనీసం వార్డ్ మెంబర్ కూడా లేనపుడు నిన్ను పెంచి పెద్ద చేసి ఎమ్మెల్యే చేసి, మంత్రిని చేస్తే గోరి కడతా అంటావ్. శాలపల్లిలో ఈటల నా కుడి భుజం అని కేసీఆర్ అంటే.. ఇప్పుడు నువ్వు ఆయనకు గోరి కడతావా? నువ్వు చేరిన బీజేపీ పార్టీకి నీతి ఉందా? నువ్వు కదా బీజేపీ పార్టీని తిట్టింది? నువ్వు కదా రైతులకు నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ అని, రైతులకు అన్యాయం చేస్తుంది బీజేపీ అని అన్నది? నీకు, కేంద్రంలో మోడీకి మధ్య ఏం డీల్ కుదిరింది? నువ్వు పుట్టుకతోనే వామపక్ష వాదిని అని చెప్పుకున్నావ్. మరి లెఫ్ట్ పార్టీల వాడివి బీజేపీలో ఎందుకు చేరావ్?.. నీకు, నీ బీజేపీకి నీతి లేదు. నీకు పదవి కావాలి, ఆస్తులు కావాలి అని బీజేపీలో చేరావ్. నువ్వు ముఖ్యమంత్రిని అనే వాడివా?’ అని ఈటలపై హరీష్ రావు నిప్పులు చెరిగారు.

‘‘నీకు, నీ బీజేపీకి నిజంగా నీతి, జాతి ఏమైనా ఉంటే రైతుల మీద నల్ల చట్టాలు తీసుకువస్తారా? హుజురాబాద్‌లో ఓట్లు అడిగే ముందు నువ్వు ఒకటి చెప్పాలి. రైతుల నల్ల చట్టాలు ఏమైనవి, గ్యాస్ ధరలు ఎం చేశావ్, డీజిల్, పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతున్నారు? పేద ప్రజలను మరింత పేదవారిని చేసేలా విధానాలను అవలంభిస్తున్న మీరు, మీ పార్టీ నేతలు కేసీఆర్‌ను అనడం విడ్డూరంగా ఉంది. రైతులు, ప్రజల సంక్షేమ కోసం నిత్యం పాటుపడుతున్న కేసీఆర్‌కు నీతి లేదు, జాతి లేదు అంటావా?’’ అని ఫైర్ అయ్యారు.

‘‘ఆనాడు 11 రోజులు ఇంటి నుండి బయటకు వచ్చి.. చావనైన చస్తా కానీ నా తెలంగాణ కావాలి అని కేసీఆర్ నిరాహారదీక్ష చేస్తేనే ఈనాడు బంగారు తెలంగాణ వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి పథకం అమలులో ఉంది. అవ్వ, అక్క, అన్నలు, రైతులు అందరూ కూడా సంతోషం గా ఉండడానికి కారణం కేసీఆర్. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిని అంటున్నావ్.. నీకు పేద ప్రజల మీద ప్రేమ ఉంటే 5000 డబుల్ బెడ్రూం లు ఇస్తే ఒక్కటైన కట్టలేదు ఎందుకు?’’ అని ఈటలను మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.

‘‘ప్రతిసారి మైకులు పట్టుకొని ఆత్మగౌరవం అని తన బాధను అందరిపై రుద్దుతున్నాడు. మన బాధలు తిరాలన్నా, అభివృద్ధి జరగలన్నా గెల్లు శ్రీనివాస్‌ని గెలిపించండి. మీకు డబుల్ బెడ్రూం లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. ఈటల మళ్ళీ మంత్రి కాలేడు.. ఎమ్మెల్యే కాలేడు.. కాబట్టి గెల్లు శ్రీనివాస్ ను గెలిపించండి.’’ అని హుజూరాబాద్ ప్రజలకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

Also read:

KKR vs PBKS, IPL 2021: పంజాబ్ టార్గెట్ 166.. అర్థశతకంతో ఆకట్టుకున్న వెంకటేష్ అయ్యర్

Kiara Advani : సౌత్‌లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ.. కియారా చేతిలో మరో భారీ మూవీ.?

Zodiac Signs: ఈ రాశులవారు ఎలప్పుడూ సంతోషంగా జీవితాన్ని గడుపుతారు.. అందులో మీరున్నారా.!