బ్యాలెట్ పేపర్ తోనే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. ఎన్నికలు ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికల సంగ్రామానికి రెడీ అయింది. ఫిబ్రవరి 15వ తేదీ లోపు మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘాకి ప్రభుత్వం లేఖ రాసింది. ఇక ఎన్నికల సంఘం అధికారులు షెడ్యూల్ ఫిక్స్ చేయనున్నారు. ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.

బ్యాలెట్ పేపర్ తోనే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. ఎన్నికలు ఎప్పుడంటే..?
Municipal Elections In Ballot Papers

Edited By:

Updated on: Jan 21, 2026 | 7:00 PM

తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికల సంగ్రామానికి రెడీ అయింది. ఫిబ్రవరి 15వ తేదీ లోపు మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘాకి ప్రభుత్వం లేఖ రాసింది. ఇక ఎన్నికల సంఘం అధికారులు షెడ్యూల్ ఫిక్స్ చేయనున్నారు. ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటికే తుది ఓటర్ల జాబితా ప్రకటించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. అదే విధంగా జనవరి 16వ తేదీన పోలింగ్‌ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటర్ ఫైనల్ లిస్ట్, ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా అప్ లోడ్ చేసింది. దీంతో పాటు బ్యాలెట్‌ బాక్స్ లు, ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామకానికి ఉద్యోగుల వివరాలను టి-పోల్‌లో అప్డేట్ చేయాలని SEC అదేశించింది.

అయితే ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ని సిద్ధం చేస్తుంది ఎలక్షన్ కమిషన్. ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించిన సింబల్స్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 75 గుర్తులను కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారులు గెజిట్ విడుదల చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి బ్యాలెట్ పేపర్లో మొదటి స్థానం దక్కనుంది. తర్వాత బీఎస్పీ, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు వరుసగా స్థానాలు కేటాయించారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయ్యి పార్టీ సింబల్స్ లేని 77 పొలిటికల్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల కోసం 75 గుర్తులను కేటాయించారు. ఇందులో మొదటగా ఏసి, ఆపిల్, గాజులు, పండ్ల బుట్ట, బ్యాట్, బ్రెడ్ వంటి గుర్తులున్నాయి.

ఇక ఎన్నికల్లో ముఖ్యమైన అంశం రిజర్వేషన్ ఖరారు.2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లను, రాష్ట్రంలో కులగణన కోసం ఏర్పాటు చేసిన డెలిగేట్స్‌ కమిషన్‌ ప్రతిపాదనల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను అధికారులు ఖరారు అయ్యాయి.121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. అదే విధంగా మిగిలిన 61 లో ఉమెన్ జనరల్31, ఆన్ రిజర్విడ్ 30 ఉన్నాయి. మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు.ఐతే ప్రస్తుతనికి రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు,7 కార్పొరేషన్ల ఎన్నికలకు ఒకే దశలో ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏ క్షణమైనా ఎలక్షన్ షెడ్యూల్ విడుదల అవ్వనుంది. ఫిబ్రవరి 15వ తేదీ లోపు ఎన్నికలను పూర్తి చేసేందుకు సన్నాహం చేస్తోంది ఎస్ఈసీ. ప్రభుత్వం నుండి క్లియరెన్స్ లెటర్ అందిన తరవాత ఎన్నికల సంఘం అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని.. ఎన్నికల తేదీ, నిర్వహణ అంశంపై తేదీలను ఫిక్స్ చేయనుంది. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 14 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. దీనికి సంబంధించి జిల్లా వారీగా అధికారులతో మాట్లాడి ఎన్నికల నిర్వహణపై సూచనలు చేస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..