Hyderabad: కౌన్సెలింగ్‌కు పిలిచారని భయంతో టెకీ సూసైడ్‌.. అసలేం జరిగిందంటే?

|

Aug 25, 2023 | 4:56 PM

కష్టపడి చదివి సాఫ్ట్‌వేర్‌ కొలువు పొందాడు. తల్లిదండ్రుల చూసిన యువతితో రెండు నెలల క్రితం వివాహం కూడా జరిగింది. కొన్ని రోజులకే నూతన దంపతుల మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను కౌన్సెలింగ్‌కు రమ్మన్నారు. ఐతే కౌన్సెలింగ్‌కు భయపడ్డాడో.. మరేమైందో తెలియదు కానీ ఉన్నట్లుండి..

Hyderabad: కౌన్సెలింగ్‌కు పిలిచారని భయంతో టెకీ సూసైడ్‌.. అసలేం జరిగిందంటే?
Software Committed Suicide
Follow us on

సిద్దిపేట, ఆగస్టు 25: కష్టపడి చదివి సాఫ్ట్‌వేర్‌ కొలువు పొందాడు. తల్లిదండ్రుల చూసిన యువతితో రెండు నెలల క్రితం వివాహం కూడా జరిగింది. కొన్ని రోజులకే నూతన దంపతుల మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను కౌన్సెలింగ్‌కు రమ్మన్నారు. ఐతే కౌన్సెలింగ్‌కు భయపడ్డాడో.. మరేమైందో తెలియదు కానీ ఉన్నట్లుండి కనబడకుండా పోయాడు. ఆ తర్వాత ఓ జలాశయంలో శవమై తేలాడు. ఈ షాకింగ్‌ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సై సుభాష్‌గౌడ్‌ తెలిపిన వివరాలు..

సిద్దిపేట సంజీవయ్యనగర్‌కు చెందిన పుట్ల కిరణ్‌ కుమార్‌ (32) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. రెండు నెలల క్రితం గోదావరిఖనికి చెందిన అశ్విని అనే యువతితో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. కొన్నాళ్లు వీళ్ల కాపురం సవ్యంగానే సాగింది. ఐతే పెళ్లయిన నెల రోజుల మధ్య దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.

మరో కిరణ్‌ కుమార్‌ భార్య అశ్విని గోదావరిఖని ఠాణాలో తన భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు అతన్ని ఆగస్టు 24న కౌన్సెలింగ్‌కు పిలిచారు. ఆగస్టు 24కి ముందు రోజు అంటే మంగళవారం సాయంత్రం తన బావమరిది నరేందర్‌తో కలిసి కిరణ్‌ కుమార్‌ రంగనాయకసాగర్‌ జలాశయానికి వెళ్లాడు. చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్‌ జలాశయం కట్టపై ఫోన్‌లో మాట్లాడుతూ ఉండమని నరేందర్‌కి చెప్పాడు. ఇమాంబాద్‌ రోడ్డు వద్ద కొంత దూరంలో అంటే సుమారు 200 మీటర్ల దూరంలో నరేందర్‌ నిలబడి ఉన్నాడు. అప్పటి వరకూ జలాశయం వద్ద ఉన్న కిరణ్‌ కుమార్‌ కొద్ది సేపటికి కనిపించలేదు. కుటుంబ సభ్యులు జలాశయంలో, చుట్టు పక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. కిరణ్‌ కుమార్ 15 రోజులుగా కనిపించకుండా పోయాడని నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం జలాశయంలో మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.