Telangana: టీచర్ కావాలనుకునేవారికి శుభవార్త.. ఇక నుంచి ఏటా టెట్ పరీక్ష

|

May 20, 2023 | 5:08 AM

ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకనే అభ్యర్థులకు తీపి కబురు రానుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఇకనుంచి ప్రతి ఏడాది ఒకసారి తప్పకుండా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

Telangana: టీచర్ కావాలనుకునేవారికి శుభవార్త.. ఇక నుంచి ఏటా టెట్ పరీక్ష
Exam
Follow us on

ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకనే అభ్యర్థులకు తీపి కబురు రానుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఇకనుంచి ప్రతి ఏడాది ఒకసారి తప్పకుండా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే గత ఏడాది జూన్ 12 న టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో ఏడాది కావడంతో మరోసారి ఈ పరీక్షను నిర్వహించాలని స్పష్టం చేసింది.

ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం డీఎడ్, బీఎడ్ పాసైన వారు టెట్‌లో ఉత్తీర్ణులైతే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(TRT) రాయడానికి అర్హులవుతారు. అయితే టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ర్యాంకింగ్‌లో 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. దీనివల్ల ఒకసారి అర్హత సాధించిన వారు కూడా పరీక్షలో తమ స్కోరు పెంచుకునేందుకు మళ్లీ టెట్ రాసేందుకు ఆసక్తి చూపుతుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి