TSRTC Bus: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం.. ఇకపై బస్సుల్లో అలాంటి పోస్టర్లపై నిషేధం

|

Sep 16, 2021 | 6:19 PM

సంచలనాలకు మారు పేరు అయిన ఐపీఎస్ అధికారి వీసీ స‌జ్జనార్ మరో కీల‌క నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన స‌జ్జనార్ తన మార్క్ చూపిస్తున్నారు.

TSRTC Bus: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం.. ఇకపై బస్సుల్లో అలాంటి పోస్టర్లపై నిషేధం
Rtc Md Sajjanar On Cinema Posters
Follow us on

RTC MD Sajjanar on Bus Posters: సంచలనాలకు మారు పేరు అయిన ఐపీఎస్ అధికారి వీసీ స‌జ్జనార్ మరో కీల‌క నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన స‌జ్జనార్ తన మార్క్ చూపిస్తున్నారు. ఇటీవల అనామకుడిలా సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆశ్లీల పోస్టర్లను అంటించకుండా నిషేధం విధించారు. ఈ మేర‌కు ఆయ‌న ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఆర్టీసీ బ‌స్సుల‌పై అసౌక‌ర్యంగా, అభ్యంత‌ర‌క‌రంగా ఉండే పోస్టర్లను వెంట‌నే తొల‌గించాల‌ని సంబంధిత అధికారుల‌కు స‌జ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.

అభిరామ్ అనే ఓ జ‌ర్నలిస్టు.. ఆర్టీసీ బ‌స్సుల‌పై అంటించే ఆశ్లీల పోస్టర్ల విష‌యాన్ని స‌జ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియా వేదికగా నెటిజ‌న్ ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ స్పందించారు. ఆర్టీసీ బ‌స్సుల‌పై ఇలాంటి పోస్టర్లు లేకుండా ఆర్టీసీ ఎండీగా చ‌ర్యలు తీసుకుంటాన‌ని స‌జ్జనార్ ప్రక‌టించారు. ఇచ్చిన ప్రక‌ట‌న మేర‌కు ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆశ్లీల ఫోటోల‌ను నిషేధిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, ఆర్టీసీలో పాలనపరమైన సంస్కరణలు తీసుకువచ్చేందుకు సజ్జనార్ ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు.


Read Also… APSFC Recruitment: ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే. 

Bears Visit Temple: ఛత్తీస్‌ఘడ్ చండీ దేవాలయంలో అద్భుతం.. పూజారి గంట కొట్టగానే పరిగెత్తుకుంటూ వస్తున్న ఎలుగుబంట్లు