Telangana: రాష్ట్ర ప్రజలకు కోవిడ్ అలెర్ట్.. మళ్లీ పుంజుకుంటున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే.. ..

|

Mar 14, 2023 | 8:57 PM

తెలంగాణ రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా నమోదు అవుతున్న పరిస్థితులలో గత వారం రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా..

Telangana: రాష్ట్ర ప్రజలకు కోవిడ్ అలెర్ట్.. మళ్లీ పుంజుకుంటున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులంటే.. ..
Telangana Covid 19 Cases
Follow us on

తెలంగాణలో కరోనా కేసులు మరోసారి విజృంభించే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా నమోదు అవుతున్న పరిస్థితులలో గత వారం రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రోజువారీ కేసుల సంఖ్య కనీసం 50కి పైగానే నమోదవుతోంది. అలాగే గడచిన 24 గంటల్లో 5,254 కరోనా పరీక్షలు నిర్వహించగా, 52 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 30 కొత్త కేసులను గుర్తించారు. అలాగే మిగిలిన జిల్లాల వివరాల్లోకి వెళ్తే.. అదిలాబాద్ 2, కామారెడ్డి 3, కరీంనగర్ 2, ఖమ్మం 2, మెహబూబ్‌నర్ 1, మెదక్ 1, మేడ్చల్ మల్కాజ్‌గిరి 3, రాజన్న సిరిసిల్ల 1, రంగారెడ్డి 2, సంగారెడ్డి 1, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 17 మంది కరోనా నుంచి కోలుకోగా.. 267 మంది కరోనా కారణంగా ఐసొలేషన్‌లో ఉన్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య అధికారులు పలు సూచనలు జారీ చేశారు.
10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో.. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు తప్పనిసరి అయితే తప్ప ఆరుబయట వెళ్లకుండా ఉండాలని సూచించారు. అలాగే 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో కోవిడ్ సంక్రమణ ఎక్కువగా ఉంటుందని.. బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కూడా సూచించారు. వ్యక్తుల మధ్య 6 అడుగుల కంటే ఎక్కువ దూరం నిర్వహించడం ముఖ్యమని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని పౌరులను అభ్యర్థించారు.

అలాగే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీర నొప్పులు, తలనొప్పి వంటి ఏదైనా ఫ్లూ/ఇన్‌ఫ్లుఎంజా వంటి లక్షణాలు ఉంటే, దయచేసి సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి నివేదించి, ఆలస్యం చేయకుండా ఆరోగ్య సేవలను పొందాలని కోరారు. ఇంకా హైపర్‌టెన్షన్, డయాబెటిస్, కార్డియాక్ అనారోగ్యం, క్రానిక్ కిడ్నీ వ్యాధి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, క్యాన్సర్/లేదా ఏదైనా ఇతర దీర్ఘకాలిక అనారోగ్యం వంటి సహ-అనారోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు ఇంట్లోనే ఉండాలని.. వైద్యానికి మినహా ఎలాంటి ప్రయాణాలకు దూరంగా ఉండాలని అభ్యర్థించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..