Telangana Corona Updates: తెలంగాణలో రోజూవారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా నమోదు అవుతున్నాయి. మంగళవారం నాడు 645 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. ఇవాళ 12 కేసులు అదనంగా కలిపి 657 కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,16,815 సాంపిల్స్‌ని పరీక్షించారు. మొత్తం ఇప్పటి వరకు 2,16,70,005 పరీక్షించారు. ఇక రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,43,093 లకు చేరింది. గడిచిన ఒక్క రోజులో 578 మంది కరోనా బాధితులు.. ఆ వైరస్ బారి నుంచి కోలుకుని సురక్షితంగా బయటపడ్డారు. దాంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,29,986 లకు చేరింది. ఇక ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 3,793 లకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,314 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 97.96 శాతం రికవరీ రేటు ఉండగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.
ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే.. రోజూ వారీగా జిల్లాల్లో నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుందనే చెప్పాలి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కొద్ది రోజులు కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండగా.. మరికొద్ది రోజులు పెరుగుతుంది. ఒక్కరోజులో జిల్లాల్లో నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ 3, బద్రాద్రి కొత్తగూడెం 16, జీహెచ్ఎంసీ పరిధిలో 77, జగిత్యాల 25, జనగామ 13, జయశంకర్ భూపాలపల్లి 4, జోగులాంబ గద్వాల 3, కామారెడ్డి 4, కరీంనగర్ 64, ఖమ్మం 59, కొమరంభీం ఆసిఫాబాద్ 2, మహబూబ్‌నగర్ 5, మంచిర్యాల 18, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 32, ములుగు 5, నాగర్ కర్నూల్ 6, నల్లగొండ 42, నారాయణపేట 0, నిర్మల్ 2, నిజామాబాద్ 6, పెద్దపల్లి 42, రాజన్న సిరిసిల్ల 20, రంగారెడ్డి 36, సంగారెడ్డి 10, సిద్దిపేట 19, సూర్యాపేట 23, వికారాబాద్ 3, వనపర్తి 2, వరంగల్ రూరల్ 15, వరంగల్ అర్బన్ 62, యాదాద్రి భువనగిరి 22 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Also read:
అంధుల కోసం ప్రత్యేక కెమెరా అభివృద్ధి చేసిన అమెరిక పరిశోధకులు.. వీడియో
Viral Video: ఎలియెన్స్ రక్తం ఏ రంగులో ఉంటుందో తెలుసా..?? వీడియో
Manchu Vishnu: తనయుడితో కలిసి మంచు విష్ణు హార్స్ రైడింగ్.. పెద్ద సాహసమే చేశాడుగా..