Telangana Corona Updates: తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న పాజిటివ్ కేసులు.. ఈ ప్రాంతంలో మాత్రం..

|

Aug 17, 2021 | 8:32 PM

Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. అయితే, రోజూవారీగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

Telangana Corona Updates: తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న పాజిటివ్ కేసులు.. ఈ ప్రాంతంలో మాత్రం..
Corona
Follow us on

Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. అయితే, రోజూవారీగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో నమోదువుతున్న కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. రాజధాని హైదరాబాద్ పరిధిలో మాత్రం ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ తరువాత ఆ స్థాయిలో కరీంనగర్ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 87,230 సాంపిల్స్ పరీక్షించగా.. వీటిలో 417 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్ర ఇప్పటి వరకు 6,53,202 మంది కరోనా బారిన పడ్డారు. ఇక 569 మంది కరోనా నుంచి కోలుకోగా.. వీరి సంఖ్య 6,42,416కి చేరింది. కాగా, కరోనా వైరస్ ప్రభావంతో ఒక్క రోజులో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మొత్తంగా చూసుకుంటే కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 3,847కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,939 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో చాలా మంది హోమ్ ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతుండగా.. సీరియస్‌గా ఉన్న వారు మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 98.34 శాతం రికవరీ రేటు ఉండగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 84 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత స్థానంలో కరీంనగర్ నిలిచింది. ఈ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 54 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నల్లగొండ జిల్లాలో 29, వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో 27, రంగారెడ్డి పరిధిలో 23, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో 21 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Also read:

Black Fungus Effect: బ్లాక్ ఫంగస్‌ భయంతో దంపతుల ఆత్మహత్య.. అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు దాచి మరీ..

Neeraj Chopra: ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

Property Benefits: భార్య పేరు మీద ఇల్లు కొనుగోలు చేస్తున్నారా?.. ఆసక్తికర విషయాలు మీకోసమే..

Health Tips: షుగర్ పేషెంట్లు ఏ పండ్లు తినొచ్చు.. ఏ పండ్లు తినొద్దు.. పూర్తి వివరాలు మీకోసం..