Telangana Ration Card Status: తెలంగాణలో రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేశారా? అయితే స్టేటస్‌ చెక్‌ చేసుకోండిలా..!

|

Jun 10, 2021 | 3:21 PM

Telangana Ration Card Status: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రేషన్‌ కార్డులను ఆమోదించాలని జూన్‌ 8న తెలంగాణ కేబినెట్‌ తెలిపిన విషయం తెలిసిందే. అయితే రేషన్‌ కార్డుకు..

Telangana Ration Card Status: తెలంగాణలో రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేశారా? అయితే స్టేటస్‌ చెక్‌ చేసుకోండిలా..!
Telangana Ration Card
Follow us on

Telangana Ration Card Status: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రేషన్‌ కార్డులను ఆమోదించాలని జూన్‌ 8న తెలంగాణ కేబినెట్‌ తెలిపిన విషయం తెలిసిందే. అయితే రేషన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు వాటిని స్వీకరించారా..? లేదా అనేది ఎలా చూడాలో చాలా మందికి తెలిసి ఉండదు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు వాటిని అప్రూవ్‌ చేశారా లేదా అని మీ సేవ సెంటర్‌కు వెళ్లి చూసుకుంటారు. ఎక్కడికో వెళ్లి సమయం వృథా చేసుకోవడం అవసరం లేదు. మీరు మీ ఇంట్లోనే ఉండి మోబైల్‌లో చెక్‌ చేసుకోవచ్చు. దాని కోసం ముందుగా Telangana Ration card అని టైప్ చేస్తే మనకు చాలా వెబ్ సైట్స్ కనిపిస్తుంటాయి.

అందులో National food security card వెబ్ సైట్ కి వెళ్లి.. ఎడమ చేతి వైపు కొన్ని ఆప్షన్లు కనపడుతాయి. అందులో మొదటి కేటగిరీ Fsc Search లోకి వెళ్లాలి. అందులో Ration card Search లో రెండు కేటగిరీలు ఉంటాయి. ఇక అందులో Fsc Application Search ఆప్షన్ లోకి వెళ్తే.. అందులో మూడు కేటగిరీలు కనపడుతాయి. మీరు ఏ జిల్లాకు దరఖాస్తు చేసుకున్నారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత Search by అనే కేటగిరీలో మూడు ఆప్షన్ లు ఉంటాయి. అందులో మనకు కావాల్సింది ఎంచుకోవాలి. మొబైల్‌ నెంబర్‌, మీ సేవ నెంబర్‌ లేదా ఆప్లికేషన్‌ నెంబర్‌ లలో ఏదో ఒకటి ఎంచుకుని సెర్చ్‌ చేస్తే స్టేటస్‌ కనిపిస్తుంది.

మొబైల్ నెంబర్, మీసేవ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మనం వాటిని ఇచ్చినట్లయితే దరఖాస్తు స్టేటస్ కనిపిస్తుంది. కుడి వైపు చివరలో మన దరఖాస్తు స్టేటస్ రిజెక్ట్ లేదా అప్రూవ్ అని, లేదా పెండింగ్ లో ఉంటే పెండింగ్ అని చూపిస్తుది.

ఇవీ కూడా చదవండి:

LPG Gas Connection: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌.. ఎలాగంటే..!

Savings Account: మంచి రాబడులు వచ్చేందుకు పెట్టుబడులు.. పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు..!