Telangana: కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ ప్రభుత్వం..!
Telangana: ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస వేతనాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వారపు సెలవులు లేదా ప్రభుత్వ సెలవు దినాలలో పనిచేసే ఉద్యోగులకు రెట్టింపు వేతనం చెల్లించాలని, రోజుకు ఎనిమిది గంటలకు మించి చేసే..

Telangana Govt
Telangana: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన కనీస వేతనాలను సవరించింది. ఈ కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి, కేబినెట్ ఉపసంఘం చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త నోటిఫికేషన్ ప్రకారం, కనీస నెలవారీ వేతనాలను కార్మికుల నైపుణ్యం (Skill), వారు పనిచేసే ప్రాంతాల ఆధారంగా మూడు జోన్లుగా విభజించారు.
- జోన్-I: మున్సిపల్ కార్పొరేషన్లు
- జోన్-II: మున్సిపాలిటీలు
- జోన్-III: గ్రామీణ, ఇతర ప్రాంతాలు
సవరించిన కనీస నెలవారీ వేతనాలు
| నైపుణ్య వర్గం | జోన్-I | జోన్-II | జోన్-III |
|---|---|---|---|
| నైపుణ్యం లేని | రూ. 16,000 | రూ. 15,000 | రూ. 14,000 |
| సెమీ-స్కిల్డ్ | రూ. 17,000 | రూ. 16,000 | రూ. 15,000 |
| నైపుణ్యం | రూ. 18,500 | రూ. 17,500 | రూ. 16,500 |
| అత్యంత నైపుణ్యం | రూ. 20,000 | రూ. 19,000 | రూ. 18,000 |
ముఖ్యమైన నిబంధనలు:
- సెలవు దినాల్లో పని: వీక్లీ ఆఫ్ లేదా ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేసే ఉద్యోగులకు రెట్టింపు వేతనం (Double wages) చెల్లించాలి.
- ఓవర్‌టైమ్: రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే, ఆ అదనపు సమయానికి సాధారణ వేతనం కంటే రెట్టింపు రేటుతో పరిహారం ఇవ్వాలి.
- లింగ సమానత్వం: ఒకే రకమైన పని చేసే పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులందరికీ సమాన వేతనాలు అందించాలి.
- చెల్లింపు విధానం: యజమానులు వేతనాలను నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాల్లోకి చెక్కులు లేదా ఆన్‌లైన్ విధానాల (NEFT, RTGS, IMPS) ద్వారా మాత్రమే బదిలీ చేయాలి.
- కొత్త రంగాలు: ఈ కనీస వేతనాల పరిధిలోకి ఇ-కామర్స్, కొరియర్ సర్వీసులు, మతపరమైన సంస్థలు, అమ్యూజ్‌మెంట్ & వాటర్ పార్కులు, మొబైల్ టవర్ల నిర్వహణ, రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) యూనిట్లు వంటి పలు కొత్త రంగాలను కూడా చేర్చారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: Ration Card: రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త స్కీమ్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Follow Us




