Rain alert: మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు బిగ్‌ అలర్ట్

తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Rain alert: మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు బిగ్‌ అలర్ట్
Rain Alert

Updated on: Oct 11, 2025 | 10:09 PM

తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. శనివారం నాగర్‌ కర్నూల్‌, జోగులాంబ గద్వాల భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇక ఆదివారం విషయనికి వస్తే రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక సోమవారం సూర్యాపేట, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇక మంగళవారం సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సూర్యాపేట, మహబూబాబాద్‌, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ కూడా జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us