Telangana Public health director G Srinivasa Rao: కరోనావైరస్ రిపోర్టు లేకపోయినా లక్షణాలు ఉంటే.. అలాంటి వారిని వెంటనే ఆసుపత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్‌లల్లో చేర్చుకోవాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్చుకోవడంపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అందరూ పాటించాలని ఆయన సూచించారు. ఈ మేరకు శ్రీనివాసరావు అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీచేశారు. కోవిడ్ రిపోర్టు లేకపోయినా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్ కేర్ సెంటర్‌లలో చేర్చుకోవాలని స్పష్టంచేశారు. లక్షణాలతో వచ్చే రోగులను ఎలాంటి కారణంతో తిప్పి పంపించొద్దని ఆదేశాలు జారీచేశారు.
ఆసుపత్రులకు వచ్చే రోగులకు గుర్తింపు కార్డు లేకపోయినా.. స్థానికేతరులకు చికిత్స అందించాలన్నారు. కోవిడ్ బాధితుల డిశ్చార్జి విషయంలోనూ కేంద్ర మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కేంద్ర మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని డీఎంహెచ్ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇటీవల కాలంలో తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు పలు కఠిన ఆంక్షలను, ఆదేశాలను విధిస్తూ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా శ్రీనివాసరావు ఈ ఆదేశాలను జారీ చేశారు.
Also read: