తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్ ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. అయితే ఈ నెల 26న శుక్రవారంన ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్ష రాసేందుకు మొత్తం 1,05,742మంది దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. మే 17న తెలంగాణ వ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.
అయితే ఆ రోజు జరిగిన ఈ పరీక్షకు మొత్తంగా 98,273 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. అంటే ఇది 92.94 శాతం అన్నమాట. పరీక్ష రాసిన వారిలో 54,700 మంది అబ్బాయిలు ఉండగా, 43,573 మంది అమ్మాయిలు ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం