Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం (Mallu Swarajyam) హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో (Care Hospital) చికిత్స పొందుతూ మృతి చెందారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి...

Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
Mallu Swarajyam

Updated on: Mar 19, 2022 | 8:35 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం (Mallu Swarajyam) హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో (Care Hospital) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (Tungaturthi) నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును ముచ్చెమటలు పట్టించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం ఇంటిని దగ్ధం చేశారు. సాయుధ పోరాటంలో అదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు. మహిళ కమాండర్ గా పని చేసిన మల్లు స్వరాజ్యాన్ని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని నైజాం ప్రభుత్వం ప్రకటించడం విశేషం. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు మల్లు స్వరాజ్యం. వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు.

మల్లు స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సీపీఎం పార్టీ తరఫున పనిచేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యానికి ఇద్దరు కుమారులు, ఒక కుమర్తె సంతానం. కాగా ఆమె భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి అనారోగ్యంతోనే 2004, డిసెంబర్ 25న కన్ను మూశారు.

Also  Read

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో భారత ప్రధాని మోడీ భేటీ.. ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చ

Instagram: మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చూస్తున్నారో ఇలా తెలుసుకోండి.. ఈ కొత్త ఫీచర్‌తో చాలా సింపుల్‌..

Telangana Crime: మహిళపై వీఆర్ఏ అత్యాచారాయత్నం.. అడ్డొచ్చిన భర్త చేతివేళ్లు కొరికి