Police Kumbing: మావోయిస్టుల కదలికలపై సమాచారం.. ఉమ్మడి ఆదిలాబాద్‌ను జల్లెడ పడుతున్న పోలీసులు..

|

Sep 18, 2022 | 9:17 AM

Police Kumbing: పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వణికిపోతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక హడలిపోతున్నారు గిరిజనులు.

Police Kumbing: మావోయిస్టుల కదలికలపై సమాచారం.. ఉమ్మడి ఆదిలాబాద్‌ను జల్లెడ పడుతున్న పోలీసులు..
Police Kumbling
Follow us on

Police Kumbing: పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వణికిపోతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక హడలిపోతున్నారు గిరిజనులు. ఇంతకీ, ఆదిలాబాద్‌ అడవుల్లో ఏం జరుగుతోంది? మావోయిస్ట్‌ వారోత్సవాలవేళ ఆదిలాబాద్‌ అడవుల్లో అలజడి వెనక మతలబు ఏంటి? వివరాల్లోకెళితే.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోకి మావోయిస్ట్‌ దళం ఎంటరైందన్న ఇన్ఫర్మేషన్‌తో నెలరోజులుగా అడవులను జల్లెడ పడుతున్నాయి కూంబింగ్‌ దళాలు. ఏజెన్సీలో అణువణువూ గాలిస్తున్నాయి. గిరిజన గ్రామాల్లో ఇంటింటినీ చెక్‌ చేస్తుండటంతో అడవి బిడ్డలకు కంటి మీద కునుకు కరువవుతోంది. నిర్మల్‌, కుమ్రంభీమ్‌, భూపాలపల్లి జిల్లాల ఎస్పీలు స్వయంగా సీన్‌లోకి దిగి, కూంబింగ్‌ నిర్వహించడం కలకలం రేపింది. ఇప్పుడు ఏకంగా ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు ఆకస్మికంగా పర్యటించడం, కూంబింగ్‌ను పర్యవేక్షించడం మరింత కల్లోలం రేపుతోంది).

గతంలో మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన పోలీసులను సైతం డిప్యుటేషన్‌పై ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు తీసుకొస్తున్నారు ఉన్నతాధికారులు. వారంతా సివిల్‌ డ్రెస్‌ల్లో విధులు నిర్వహించడం మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది. గ్రేహౌండ్స్‌, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు కలిసి ఏకకాలంలో అడవులను జల్లెడపడుతూ అడెళ్లు దళం కోసం గాలిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను నలువైపులా చుట్టుముట్టి కూంబింగ్‌ చేస్తున్నాయి దళాలు. మెయిన్‌గా 12 ప్రాంతాలను టార్గెట్‌ చేసుకుని ముందుకు కదులుతున్నారు. కవ్వాల్‌, కదంబ, మంగి, తిర్యాణి, వాయుపేట్‌, వేమనపల్లి, బెజ్జూర్‌లో అణువణువూ గాలిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటుచేసి చెకింగ్స్‌ చేస్తున్నారు. అయితే, నెల రోజులుగా ఏజెన్సీని జల్లెడ పడుతున్నా.. అడెళ్లు దళం ఆచూకీ, కదలికలపై కొంచెం కూడా క్లూ దొరికినట్లు కనిపించడం లేదు. ఇంతకీ, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో అడెళ్లు దళం ఉన్నట్టా? లేనట్టా? పోలీసుల హడావిడి అంతా ఉత్తదేనా? చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..