Hostel warden Harassment: హైదరాబాద్‌లో దారుణం.. అశ్లీల వీడియోలతో అబ్బాయిలపై వార్డెన్‌ అరాచకం.!

Hostel warden Harassment: హైదరాబాద్‌లో దారుణం.. అశ్లీల వీడియోలతో అబ్బాయిలపై వార్డెన్‌ అరాచకం.!

Anil kumar poka

|

Updated on: Sep 18, 2022 | 9:37 AM

హైదరాబాద్‌ మహానగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాయ్స్‌ హాస్టల్‌లో వార్డెన్‌ అఘాయిత్యాలు బయటపడ్డాయి. అశ్లీల వీడియోలు చూపించి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న..


హైదరాబాద్‌ మహానగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాయ్స్‌ హాస్టల్‌లో వార్డెన్‌ అఘాయిత్యాలు బయటపడ్డాయి. అశ్లీల వీడియోలు చూపించి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న హాస్టల్ వార్డెన్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. వార్డెన్ తమ ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ అసభ్యంగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వార్డెన్‌పై ఏడుగురు విద్యార్థుల బృందం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వార్డెన్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముర్రం కృష్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నెల రోజుల క్రితమే హాస్టల్‌లో వార్డెన్‌గా చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి ఉండేవాడని, అలా మైనర్ బాలులతో దగ్గరవుతూ.. అవకాశం దొరినప్పుడల్లా విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ.. లైంగికంగా వేధించేవాడని పోలీసులు నిర్ధారించారు. అంతేకాదు.. విద్యార్థులు స్నానాలు చేస్తుండగా వారి బాత్‌రూమ్‌లలోకి దూరి వీడియోలు తీసేవాడని పోలీసులు తెలిపారు. వార్డెన్‌పై మొత్తం 7 కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..