Sarpanch Elections: అదృష్టం వీళ్లదే.. అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో నిత్య సర్పంచులు వీరే!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవాల జాతర కొనసాగుతోంది. మొదటి విడతతో రాష్ట్రంలోనే ఏకగ్రీవ పంచాయితీల స్థానంలో రెండవ స్థానంలో నిలవగా.. రెండు , మూడు విడతల్లో మరిన్ని పంచాయితీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆదిలాబాద్ బహిరంగ సభ ద్వారా ఏకగ్రీవాలే ముద్దు అంటూ పిలుపునివ్వడంతో ఆ వైపుగానే దూసుకెళుతున్నారు అదికార పార్టీ నేతలు. తాము బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే జిల్లాలోని ఆ ఐదు గ్రామపంచాయితీల్లో మాత్రం రెండు దశాబ్దాలుగా కుటుంబాల పాలనే కొనసాగుతోంది. అయితే భార్య లేదంటే భర్త అన్నట్టుగా సర్పంచ్ పీఠం కొనసాగుతోంది. ఆ గ్రామాలేవో చూద్దాం పదండి.

Sarpanch Elections: అదృష్టం వీళ్లదే.. అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో నిత్య సర్పంచులు వీరే!
Viral News

Edited By: Anand T

Updated on: Dec 05, 2025 | 12:33 PM

ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మేజర్ పంచాయతీలో ఇరవై ఏళ్లుగా సుంకర్ రావు, కొరెంగా గాంధారి దంపతుల పాలనే కొనసాగుతోంది. ఈ ఇద్దరు భార్య భర్తలు నాలుగు దపాలుగా సర్పంచులుగా పని చేశారు. వరుసగా ఇద్దరూ రెండేసి సార్లు పంచాయతీ ప్రథమ పౌరులుగా కొనసాగారు. 2001లో జరిగిన ఎన్నికల్లో కొరెంగా సుంకర్ రావు విజయం సాధించగా… 2006లో జరిగిన ఎన్నికలలోనూ సుంకర్ రావు బరిలో నిలిచి 1200 ఓట్ల మెజార్టితో గెలిచారు. 2013లో ఇంద్రవెల్లి మేజర్ పంచాయతీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో సుంకర్ రావు తన సతీమణి కొరెంగా గాంధారిని బరిలో నిలిపి గెలిపించారు. 2019లో సైతం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో మరో సారి పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఎస్జీ జనరల్ రిజర్వ్ కావడంతో మూడోసారి కొరెంగా సుంకర్ రావు పోటీ చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోను ఓ జంట 20 ఏళ్లుగా సర్పంచ్ కొలువును కొనసాగిస్తోంది. కాసిపేట మండలం పల్లంగూడ పంచాయతీకి చెందిన దుస్స విజయ, చందు దంపతులు మూడుసార్లు సర్పంచిగా ఎన్నికయ్యారు. మళ్లీ ఈ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా నామినేషన్ వేశారు. 2001లో దుస్స చందు సర్పంచిగా గెలుపొందగా, 2013లో దుస్స విజయ సర్పంచిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో ఆమె వైపే ఓటర్లు మొగ్గు చూపి మళ్లీ అవకాశం కల్పించారు. ప్రసుత్తం ఆమె మళ్లీ బరిలో ఉన్నారు. ఈ పంచాయతీలోని పేదింటి బిడ్డల వివాహానికి రూ.10 వేల సాయంతో పాటు, పుస్తెలు, చీరలు అందిస్తూ ప్రజల మనన్నలు పొందుతున్నారు.

అటు కొమురంభీం జిల్లా వాంకిడి మండలం దాబా పంచాయతీ ప్రజలు పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల్లో విలక్షణంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 2019లో ఎన్నికల్లో సర్పంచి స్థానం ఎస్టీ మహిళా రిజర్వే రావడంతో.. గ్రామస్థులంతా ఏకతాటిపై నిలిచి కొట్నాక సుమిత్రను, ఆరువార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఆమె సర్పంచిగా ప్రజలు ఆశించిన విధంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దడంతో మండల స్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ప్రస్తుత ఎన్నికల్లో రిజర్వేషన్ ఎస్టీ జనరల్ కు రావడంతో.. ఆమె భర్త కొట్నాక జంగును ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్థులు తీర్మానించారు. సర్పంచితో పాటు ఆరు వార్డు సభ్యులను ఏకగ్రీవం చేశారు. సర్పంచి అభ్యర్థితోపాటు వార్డు సభ్యులకు ఒక్కో నామినేషన్ దాఖలయ్యాయి. అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది

ఇదే మండలంలోని ఖనర్ం గాం గ్రామపంచాయితీకి పెందూర్ మధూకర్-సుగంధ దంపతులు 20 ఏళ్లుగా సర్పంచులుగా పనిచేస్తూ వస్తున్నారు. ఇరువురు రెండేసి సార్లు పదవుల్లో కొనసాగారు. 2001లో ఎస్టీ జనరల్ రిజర్వేషన్ రావడంతో మధుకర్ బరిలో నిలిచి సర్పంచిగా గెలిచారు. 2006 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి రిజర్వేషన్ అనుకూలించడంతో మరోసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2013 లో ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో.. భార్య సుగంధ పోటీ చేసి గెలుపొంది ప్రథమ పౌరురాలిగా కొనసాగారు. తిరిగి 2019లోనూ అనుకూలించడంతో తిరిగి సర్పంచిగా కొనసాగారు. ప్రస్తుతం ఎస్టీ జనరల్ రిజర్వ్ కావడంతో మధూకర్ మూడోసారి పోటీ చేస్తున్నారు.

కొమురంభీం జిల్లా తిర్యాణీ మండలంలోని గంభీరావుపేట గ్రామ పంచాయ తీకి ముత్యం రాజయ్య-వరలక్ష్మి దంపతులు మూడు సార్లు సర్పంచు లుగా పనిచేశారు. 1995లో బీసీ జనరల్కు కేటాయించగా.. మొదటిసారిగా రాజయ్య విజయం సాధిం చారు. 2006లో బీసీ జనరలు రిజర్వ్ కావ డంతో.. రెండోసారి గెలిచారు. 2019లో జన రల్ మహిళకు రిజర్వ్ అయింది. అప్పుడు తన భార్య వరలక్ష్మిని బరిలో నిలిపి గెలిపించారు. ప్రస్తుతం బీసీ జనరల్ రిజర్వు కావడంతో మూడోసారి రాజయ్య పోటీకి సిద్ధం అవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.