తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కల స్కైర విహారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కుక్కల పరుగులకు ప్రజలు వీధుల్లో నడవాలంటేనే ప్రజలు వణికి పోతున్నారు. ఈసారి ఏకంగా సిద్దిపేట కలెక్టరేట్‌లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డిపై కుక్కలు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
సిద్దిపేట శివారులో కలెక్టరేట్‌తోపాటు అధికారుల నివాసాలు కూడా ఉన్నాయి. అడిషన్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తాను నివాసముంటున్న క్వార్టర్స్ ఆవరణలో శనివారం రాత్రి (ఏప్రిల్ 1) వాకింగ్ చేస్తుండగా ఓ వీధి కుక్క దాడిచేసి కరిచింది. ఆయన రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇక అదేరోజు రాత్రి మరో వీధి కుక్క ఓ వ్యక్తితోపాటు, కలెక్టర్ పెంపుడు శునకాన్ని కరిచింది. కలెక్టరేట్‌కు సమీపంలోని పౌల్ట్రీఫాం వద్ద ఓ బాలుడిని కూడా కుక్కలు కరిచాయి. కలెక్టరేట్ చుట్టూ కుక్కలు నానాభీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతొ అధికారుల కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.