Telangana Secretariat: వైట్ హౌస్‌ను తలపించేలా తెలంగాణ కొత్త సచివాలయం.. ఆ రోజే ప్రారంభానికి ముహూర్తం ..!

తెలంగాణలో భవిష్యత్‌లో పెరిగే శాసనసభ్యుల సంఖ్య, మంత్రులను దృష్టిలో పెట్టుకొని ఆ మేరకు విశాలమైన కాన్ఫరెన్స్‌ రూమ్స్‌, హాల్స్‌ నిర్మించారు. ఈ భవనం ఆరో అంతస్తులో సౌత్‌ వెస్ట్‌ అంటే నైరుతి మూలలో సీఎం ఛాంబర్‌ ఉంటుంది. మొత్తం

Telangana Secretariat: వైట్ హౌస్‌ను తలపించేలా తెలంగాణ కొత్త సచివాలయం.. ఆ రోజే ప్రారంభానికి ముహూర్తం ..!
Telangana Secretariat
Follow us

|

Updated on: Jan 21, 2023 | 7:33 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సెక్రటేరియట్‌ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి జన్మదినమైన ఫిబ్రవరి 17న భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గ్రౌండ్‌ ప్లస్‌ సిక్స్‌ ఫ్లోర్లతో కూడిన ఈ భవనం అద్భుతమైన కట్టడంగా కనువిందు చేస్తోంది. ఈ భవనంలోని ఆరో అంతస్తులో సీఎం ఆఫీసు ఉంటుంది. తూర్పు ముఖంగా ఉన్న భవనంలో నైరుతి మూలన సీఎం ఛాంబర్‌ ఉంటుంది. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా దాదాపు 100 ఏళ్లు మనగలిగేలా ఈ సెక్రటేరియట్‌ భవనాన్ని నిర్మించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ పేరును ఈ భవనానికి పెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. వాన నీటిని ఒడిసిపట్టేందుకు ఈ భవనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీన్ని ఆనుకొని ప్రత్యేకంగా ఒక చిన్న రిజర్వాయర్‌ నిర్మించారు. సంప్రదాయం, ఆధునికతలకు కలబోతగా ఈ భవనం ఉండనుంది. దీనిపై ఏర్పాటు చేసిన డోమ్స్‌ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

తెలంగాణ సెక్రటేరియట్‌ మొత్తం విస్తీర్ణం 28 ఎకరాలు. ఇందులో 10, 51,676 చదరపు అడుగుల్లో భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ఎత్తు 265 అడుగులు. దేశంలోనే అతి ఎత్తైన భవనాల్లో ఇది ఒకటి. ఈ భవనంపై ఏర్పాటు చేస్తున్న జాతీయ చిహ్నాన్ని కూడా కలిపితే మొత్తం ఎత్తు 278 అడుగులవుతుంది. 11 అంతస్తుల ఎత్తులో ఈ భవనం కనిపిస్తుంది కాని ఇందులో ఉన్నవి ఆరు అంతస్తులు మాత్రమే. డెక్కన్‌, కాకతీయ శైలిలో నిర్మించిన ఈ భవనానికి 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణ. తెలంగాణ సంప్రదాయంతో పాటు ఆధునిక హంగులతో దీన్ని నిర్మించారు. ఈ పరిపాలనా సౌధానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని గతేడాది సెప్టెంబర్‌లోనే నిర్ణయించారు.

భారీ విస్తీర్ణంతో నిర్మించినప్పట్టికీ అతి తక్కువ సమయంలోనే ఈ భవనాన్ని పూర్తి చేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి జూన్‌ 27, 2019న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. జూలై 2020లో పాత భవనాల కూల్చివేత మొదలైంది. శిధిలాల తొలగింపు పనులకే నాలుగు నెలలు పట్టింది. ఏకంగా 14వేల టక్కుల లోడ్ల శిధిలాలు తొలగించారు. జనవరి 4, 2021న నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అంటే కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఇంత భారీ భవన నిర్మాణం పూర్తైంది. 14 అడుగుల ఎత్తులో ఒక్కో అంతస్తును నిర్మించారు. మొదటి అంతస్తు 20 అడుగుల ఎత్తులో నిర్మించారు. తూర్పు ముఖంగా నిర్మించిన ఈ భవనపు ఆరో అంతస్తులో సీఎం కార్యాలయం ఉంటుంది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ అంతస్తును తీర్చిదిద్దారు.

తెలంగాణలో భవిష్యత్‌లో పెరిగే శాసనసభ్యుల సంఖ్య, మంత్రులను దృష్టిలో పెట్టుకొని ఆ మేరకు విశాలమైన కాన్ఫరెన్స్‌ రూమ్స్‌, హాల్స్‌ నిర్మించారు. ఈ భవనం ఆరో అంతస్తులో సౌత్‌ వెస్ట్‌ అంటే నైరుతి మూలలో సీఎం ఛాంబర్‌ ఉంటుంది. మొత్తం ఆరు అంతస్తు అంతా ముఖ్యమంత్రికి సంబంధించిన పేషీలు మాత్రమే ఉంటాయి. ఇదే అంతస్తులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీ కూడా ఉంటుంది. మరో వైపు ఈ బిల్డింగ్‌లో వాన నీటిని ఒడిసిపట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవనానికి ఉత్తర దిక్కులో భారీ స్థాయిలో ఒక రిజర్వాయర్‌ కట్టారు. ఇందులో నీళ్లను సెక్రటేరియట్‌లోని గార్డెన్స్‌, మొక్కలకు ఉపయోగిస్తారు. అలాగే భవనంలో విద్యుత్‌ సరఫరా కోసం భారీ సౌరపలకాలు కూడా భవనంపై ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles