The liveblog has ended.
-
16 Feb 2026 06:20 PM (IST)
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
ఇబ్రహీంపట్నంలో మళ్లీ క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించారు. ఓటింగ్ హాల్‌పైరాళ్ల దాడి జరిగింది. దీంతోఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. రిటర్నింగ్ అధికారి రేపటికి వాయిదా వేశారు. అయితే హౌస్ ఆర్డర్‌లో లేదని ఆర్వో ఈ వాయిదాను వేశారు.
-
16 Feb 2026 06:04 PM (IST)
బీఆర్ఎస్ దూరం
మున్సిపాలిటీల చైర్మన్‌ల ఎన్నిక రసవత్తరంగా కొనసాగుతోంది. కరీంనగర్, నారాయణపేటలో గెలిచిన బీజేపీ.. ఓటింగ్ విషయంలో బీఆర్‌ఎస్ దూరంగా ఉంది.
-
-
16 Feb 2026 04:54 PM (IST)
బీఆర్ఎస్‌కు వచ్చిన మున్సిపాలిటీలు
ఉమ్మడి మెదక్ – ( 7 )
1. గడ్డపోతారాం
2. గుమ్మడిదల
3.ఇస్నాపూర్ (బీజేపీ సపోర్ట్)
4. జిన్నారం
5. గజ్వేల్
6. తూఫ్రాన్
7. దుబ్బాక
ఉమ్మడి మహబూబ్ నగర్ – ( 2 )
8. ఆలంపూర్
9. అయిజ
ఉమ్మడి రంగారెడ్డి ( 2 )
10. మూడు చింతలపల్లి
11. ఎల్లంపేట (బీజేపీ సపోర్ట్)
ఉమ్మడి కరీంనగర్ ( 3)
12. రాయికల్ (కాంగ్రెస్ సపోర్ట్)
13. సిరిసిల్ల
14. జమ్మికుంట
ఉమ్మడి వరంగల్ – (1)
15. చేర్యాల ఉమ్మడి నల్గొండ- (1)
16. తిరుమలగిరి
ఉమ్మడి ఆదిలాబాద్ – (1)
17. ఆసిఫాబాద్
పూర్తి మెజారిటీ ఉన్న కోల్పోయిన స్థానం- అమన్ గల్
కామారెడ్డి లో BRS, కాంగ్రెస్‌కు మద్దతు పలికింది.
-
16 Feb 2026 04:40 PM (IST)
సంగారెడ్డి: పటాన్‌చెరులో కాంగ్రెస్ పార్టీకి షాక్
మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా పటాన్‌చెరులో కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది బీఆర్‌ఎస్ పార్టీ. ఐదు మున్సిపాలిటీల్లో 4 బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఇస్నాపూర్, గుమ్మడిదల, గడ్డపోతారం, జిన్నారంలో బీఆర్‌ఎస్ హవా కొనసాగింది. ఇంద్రేశం కూడా బీఆర్‌ఎస్ దక్కించుకునే అవకాశం ఉంది.
-
16 Feb 2026 04:20 PM (IST)
ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్
సంగారెడ్డి: మంత్రి దామోదర రాజనర్సింహ ఇలాఖలో ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్మన్ గా కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ గా ఆకుల సత్యనారాయలు ఏకంగ్రీవంగా ఎన్నికయ్యారు.
-
16 Feb 2026 04:07 PM (IST)
ఆసిఫాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తల నిరసన
ఆసిఫాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అవకాశం ఉన్నా చైర్మన్ పీఠం దక్కించుకోకపోవడంతో డీసీసీ అధ్యక్షురాలిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్రం సుగుణను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
-
16 Feb 2026 03:31 PM (IST)
కరీంనగర్ గడ్డపై ధర్మం గెలిచింది: బండి సంజయ్
కరీంనగర్ గడ్డపై ధర్మం గెలిచిందని సంజయ్ అన్నారు. కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగరవేయాలన్న కల నెరవేరిందన్నారు. పక్క దేశంతో తలపడి నిన్న మ్యాచ్‌లో భారత్ గెలిచింది.. ప్రత్యర్థి పార్టీలతో కబడ్డీ ఆడి కరీంనగర్‌లో మేయర్ కప్పును బీజేపీ గెలుచుకుందని వ్యాఖ్యానించారు.
-
16 Feb 2026 02:57 PM (IST)
ఇంద్రేశం, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా
ఇంద్రేశం, జహీరబాద్ మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడ్డాయి. కోరం లేక రేపటికి వాయిదా వేశారు అధికారులు.
-
16 Feb 2026 02:51 PM (IST)
గద్వాల మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ కైవసం
గద్వాల మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా తుమ్మల జయలక్ష్మీ ఎన్నికయ్యారు. చైర్మన్ ఎన్నికకు బీజేపీ గైర్హాజరైంది. బీజేపీ గైర్హాజరు కావడంతో ఏకగ్రీవంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నిక జరిగింది.
-
16 Feb 2026 02:27 PM (IST)
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ చైర్మన్‌గా
- జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ చైర్మన్‌గా.. 13వ వార్డు నుండి గెలిచిన సీఎం సురేష్ ఎన్నిక(BRS)
- జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా.. 8వ వార్డు నుండి గెలుపొందిన మాల నరసింహులు ఎన్నిక(BRS పార్టీ)
- జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ చైర్మన్‌గా తిరుమల వసంత(కాంగ్రెస్)ఎన్నిక
- సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అంజమ్మ
-
16 Feb 2026 02:09 PM (IST)
ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక వాయిదా
- ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
- తీవ్ర గందరగోళం మధ్య వాయిదాపడ్డ ఎన్నిక ప్రక్రియ
- ఇబ్రహీంపట్నంలో ఉదయం నుంచి క్షణక్షణం ఉత్కంఠ
- 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిస్సింగ్‌తో మొదలైన వివాదం
- 24లో 23మంది కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం
- చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వాగ్వాదం
- కౌన్సిల్ హాల్‌లోనే గొడవకు దిగిన ఇరుపార్టీల కౌన్సిలర్లు
- బయట నుంచి కౌన్సిల్ హాల్‌పై రాళ్లు రువ్విన అగంతకులు
- తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు RO ప్రకటన
-
16 Feb 2026 01:55 PM (IST)
అమరచింత మున్సిపాలిటీలో అనూహ్య పరిణామం
- వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో అనూహ్య పరిణామం
- చివరి నిమిషంలో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్
- బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సువర్ణ.. చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరిక
- దీంతో సువర్ణను చైర్‌పర్సన్‌గా ప్రతిపాదించింది కాంగ్రెస్
- ఎన్నికల్లో కాంగ్రెస్ 3, BRS 3, బీజేపీ 3, సీపీఎం 1 స్థానం కైవసం
- సువర్ణకు మద్ధతు తెలిపిన CPM పార్టీ
- మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్ అఫిషియో ఓటుతో కాంగ్రెస్ ఖాతాలోకి మున్సిపల్ పీఠం చేరింది..
-
16 Feb 2026 01:43 PM (IST)
ఎన్ని కుట్రలు చేసినా ధర్మమే గెలిచింది
- శత్రు దేశంతో తలపడి నిన్న భారత్ గెలిచింది – బండి సంజయ్
- ప్రత్యర్థి పార్టీలతో పోరాడి.. కరీంనగర్‌లో మేయర్ కప్పును బీజేపీ గెలుచుకుంది
- పక్క పార్టీలతో కలిసి కుట్రలు చేశారు
- కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి బీజేపీని అడ్డుకోవాలని చూశాయి
- ఎన్ని కుట్రలు చేసినా ధర్మమే గెలిచింది
- బీజేపీ బలపడుతుందనే మాపై కుట్రలు
- రాష్ట్రంలో ప్రభుత్వాన్ని డిసైడ్ చేసేది కరీంనగర్ – బండి
-
16 Feb 2026 01:25 PM (IST)
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నోట సినిమా డైలాగ్
- పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నోట సినిమా డైలాగ్
- పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ, స్థానిక నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు
- బులెట్ దిగిందా లేదా అంటూ డైలాగ్ చెబుతూ వెళ్లిన మహిపాల్ రెడ్డి
- పటాన్‌చెరులోని 5 మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్
- గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపు
- బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో జిన్నారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
- బీజేపీ ఎంపీ రఘునందన్ ఎక్స్ అఫిషియో ఓటుతో..
- ఇస్నాపూర్ దక్కించుకున్న బీఆర్ఎస్
-
16 Feb 2026 01:12 PM (IST)
భైంసా మున్సిపాలిటీ బీజేపీ కైవసం
- భైంసా మున్సిపాలిటీ బీజేపీ కైవసం
- స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో భైంసా బీజేపీ వశం
- మున్సిపల్ చైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థి దత్తాత్రి
- భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్‌గా సిద్ధిఖీ ఎన్నిక
-
16 Feb 2026 01:02 PM (IST)
జనగామ చైర్మన్ ఎన్నికలో గందరగోళం
- జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో గందరగోళం
- చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలన్న ఎంపీ చామల కిరణ్
- పోడియం ముందు బైఠాయించిన కాంగ్రెస్, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు
- చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను పూర్తిగా వాయిదా వేయాలని ఎంపీ డిమాండ్
- 28వ వార్డు కౌన్సిలర్ కిడ్నాప్ కేసు దర్యాప్తు తేల్చాక..
- ఎన్నిక నిర్వహించాలన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
- కౌన్సిలర్ల నినాదాలతో గందరగోళంగా మారిన చైర్మన్ ఎన్నిక
-
16 Feb 2026 12:48 PM (IST)
మేయర్ పీఠం బీజేపీ కైవసం
- కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం బీజేపీ కైవసం
- కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్
- డిప్యూటీ మేయర్‌గా సునీల్‌రావు ఎన్నిక
- కరీంనగర్ కార్పొరేషన్‌లో తటస్థంగా బీఆర్ఎస్
- మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ
-
16 Feb 2026 12:43 PM (IST)
నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం
- నిజామాబాద్ మేయర్ కాంగ్రెస్ కైవసం
- మేయర్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణి ఎన్నిక
- కాంగ్రెస్ అభ్యర్థి ఉమారాణికి 34 ఓట్లు
- మేయర్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి 31 ఓట్లు
-
16 Feb 2026 12:29 PM (IST)
భీంగల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం
- భీంగల్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం
- భీంగల్ మున్సిపల్ చైర్మన్‌గా 6 వ వార్డు అభ్యర్థి బొదిరే నాగమణి
- వైస్ చైర్మన్‌గా 10 వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి సంటి లత
-
16 Feb 2026 12:18 PM (IST)
ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. బీజేపీ ఎంపీ..
- ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్..
- చైర్మన్ ఎన్నిక కోసం ఒకే కారులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్
-
16 Feb 2026 12:07 PM (IST)
నాపై దౌర్జన్యం చేశారు – ఎర్రబెల్లి
- కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దౌర్జన్యం చేశారని టీవీ9తో ఎర్రబెల్లి దయాకర్‌రావు
- విప్ జారీ చేయాల్సి ఉండటంతో పత్రాలను ఆర్డీవో ఇవ్వడానికి వెళ్లా – ఎర్రబెల్లి
- అమెరికా పౌరసత్వం ఉన్న ఝాన్సీకి మీటింగ్‌లో కూర్చునే అర్హత ఎక్కడిది – ఎర్రబెల్లి
- ఝాన్సీని అనుమతించి నన్ను ఎందుకు అనుమతించలేదు – ఎర్రబెల్లి దయాకర్‌రావు
-
16 Feb 2026 11:46 AM (IST)
పోలీసులతో ఎంపీ అర్వింద్ వాగ్వాదం
- మేయర్ ఎన్నిక కోసం నిజామాబాద్ మున్సిపల్ కార్పొఆఫీస్‌కు బీజేపీ కౌన్సిలర్లు
- మధ్యాహ్నం 12 గంటల వరకు లోపలికి అనుమతించేది లేదన్న పోలీసులు
- పోలీసులతో బీజేపీ ఎంపీ అర్వింద్ వాగ్వాదం
- కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చే వరకు ఎందుకు వేచివుండాలని అర్వింద్ ఆగ్రహం
-
16 Feb 2026 11:21 AM (IST)
తొర్రూర్‌లో హైటెన్షన్
- తొర్రూర్ మున్సిపాలిటీ దగ్గర హైటెన్షన్
- పోటాపోటీగా మోహరించిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు
- రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట
- మున్సిపల్ ఆఫీస్‌కు వచ్చిన మాజీమంత్రి ఎర్రబెల్లి
- ఎర్రబెల్లి పీఏపై కాంగ్రెస్ కార్యకర్తల దాడితో ఉద్రిక్తత
- ఎర్రబెల్లిని అక్కడినుంచి పంపించేసిన పోలీసులు
- అదనపు బలగాలను రప్పిస్తోన్న పోలీసులు
-
16 Feb 2026 11:11 AM (IST)
కరీంనగర్ మేయర్ ఎన్నికలో ట్విస్టులు..
- కరీంనగర్ మేయర్ ఎన్నికలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు
- మేయర్ ఎన్నికలో పాల్గొనకూడదని ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయం
- మేయర్ ఎన్నికపై కాంగ్రెస్, ఎంఐఎం సైలెంట్ ఉంటే ఎన్నిక కష్టమే..
- కోరం లేకపోతే మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశం.
- మేయర్ బరిలో తాము ఉన్నామని ప్రకటించిన మంత్రి పొన్నం
-
16 Feb 2026 10:57 AM (IST)
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం..!
- కామారెడ్డి మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కుదిరిన సయోధ్య
- చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులను పంచుకున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్
- చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ కూటమిలోని ఉమరాణి
- 38వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఉమారాణి
- వైస్ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ 12వ వార్డు అభ్యర్థి కాసర్ల గోదావరి
- అధికారికంగా ఎన్నిక జరిగే వరకు గోప్యంగా ఉంచుతున్న నేతలు
-
16 Feb 2026 10:43 AM (IST)
ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్..
- ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో హై టెన్షన్ నెలకొంది.
- మున్సిపాలిటీ కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు రచించాయి.
- రహస్య క్యాంపుల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు నేరుగా మున్సిపాలిటీకి చేరుకున్నారు.
- ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి సమావేశానికి చేరుకున్నారు.
- మరోవైపు.. ఇబ్రహీంపట్నంలో ఇద్దరు కార్పొరేటర్లు కిడ్నాప్ అయ్యారు.
- కాంగ్రెస్ రెబల్ కార్పొరేటర్ ఒకరు.. బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒకరు కిడ్నాప్ అయినట్లు ఫిర్యాదు
-
16 Feb 2026 10:27 AM (IST)
మెదక్ జిల్లాలో ఉత్కంఠ..
- ఉమ్మడి మెదక్ జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ
- 4 రోజులుగా క్యాంపులో మకాం వేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ
- నేరుగా మున్సిపాలిటీ ఆఫీస్‌కి వచ్చి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొననున్న కౌన్సిలర్లు
- మున్సిపల్ చైర్మన్ సీటు దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు
- ఇస్నాపూర్, జిన్నారం, కోహిర్, జహీరాబాద్..
- మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్
- నర్సాపూర్, జిన్నారం, మెదక్ మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికలో బీజేపీ కింగ్ మేకర్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్ పదవి ఆఫర్ చేసినా..
- చైర్మన్ సీటు కోసమే పట్టుబడుతున్న కమలనాథులు
-
16 Feb 2026 10:14 AM (IST)
కౌన్ బనేగా భైంసా బాద్ షా
- కౌన్ బనేగా భైంసా బాద్ షా
- భైంసాలో బీజేపీ Vs ఎంఐఎం
- స్వతంత్ర అభ్యర్థికే భైంసా ఛైర్మన్ పదవి?
- భైంసాలో చక్రం తిప్పిన ఎమ్మెల్యే రామారావు పటేల్
- ఎంఐఎం రెబల్‌గా పోటీచేసిన ఇద్దర్లో ఒకరికి చైర్మన్ పదవి ఆఫర్
- చివరి నిమిషంలో షాక్ ఇస్తామంటున్న ఎంఐఎం
- ఇప్పటికైతే ఎవరికీ దక్కని స్పష్టమైన మెజార్టీ
-
16 Feb 2026 09:59 AM (IST)
ఎంఐఎం కౌన్సిలర్ మిస్సింగ్ కలకలం
- కాగజ్‌ననగర్‌లో ఎంఐఎం కౌన్సిలర్ మిస్సింగ్ కలకలం
- తమ అభ్యర్థి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంఐఎం
- బీఆర్‌ఎస్ కిడ్నాప్ చేసిందంటూ చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీఖాన్ ఫిర్యాదు
- 3వ వార్డు నుంచి గెలిచిన ఎంఐఎం అభ్యర్థి ఆలియా బేగం
- కాగజ్‌నగర్ పీఠం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ రాజకీయాలు
-
16 Feb 2026 09:56 AM (IST)
రాత్రికి రాత్రి మారిన బెల్లంపల్లి రాజకీయ సమీకరణలు
- రాత్రికి రాత్రి మారిన బెల్లంపల్లి రాజకీయ సమీకరణలు
- చివరి నిమిషంలో బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన స్వతంత్రులు
- స్వతంత్రుల మద్దతు కూడగట్టి పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్
- 34 స్థానాలకు చెరో 14 సీట్లు గెలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్
- స్వతంత్రులు 5, ఒక బీజేపీ అభ్యర్థి గెలుపు
- కేటీఆర్ సమక్షంలో మూడు రోజుల క్రితం BRSలో చేరిన..
- ఇద్దరు స్వతంత్రులు, ఒక బీజేపీ కౌన్సిలర్
- చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరిన ఆ ముగ్గురు