Etela Rajender: ఈటల రాజెందర్‌ ఇంట తీవ్ర విషాదం.. చికిత్స పొందుతూ కన్ను మూసిన..

Telangana: బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి మల్లయ్య(104) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా మల్లయ్య వృద్ధాప్య సమస్యలతో ఆర్‌వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Etela Rajender: ఈటల రాజెందర్‌ ఇంట తీవ్ర విషాదం.. చికిత్స పొందుతూ కన్ను మూసిన..
Etela Rajender

Updated on: Aug 24, 2022 | 4:36 AM

Telangana: బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి మల్లయ్య(104) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా మల్లయ్య వృద్ధాప్య సమస్యలతో ఆర్‌వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మల్లయ్య తుదిశ్వాస విడిచారు. కాగా మల్లయ్యకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుర్లు ఉన్నారు. ఈటల రాజేందర్‌ స్వస్థలమైన హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో బుధవారం మల్లయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.