Chai pe Charcha: ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఎదుర్కొంటోన్న అన్ని సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. డిప్యూటీ స్పీకర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ఆయన ఉస్మానియా యూనివర్సిటీ లో స్విమ్మింగ్ పూల్, ప్లేగ్రౌండ్ లకు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విద్యార్థుల ఆహ్వానం మేరకు చాయ్ పే చర్చలో భాగంగా వివిధ అంశాలపై విద్యార్థులతో ముచ్చటించారు.
OU PHD స్కాలర్స్ వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో ఉస్మానియా యూనివర్శిటీలోని చెట్ల కింద కూర్చుని చాయ్ తాగుతూ మంత్రి విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. యూనివర్సిటీ సమస్యలు, PhD ఫెలోషిప్స్ గురించి విద్యార్థులు మంత్రికి విన్నవించగా వాటిని సీఎం KCR, KTR దృష్టికి తీసుకెళ్లి, యూనివర్సిటీ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో TTUC రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, సీనియర్ స్కాలర్ విద్యార్థి నాయకుడు రవికుమార్ గౌడ్, TRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, రాజు యాదవ్, మంతెన మధు, అజాద్, వెల్పుకొండ రామకృష్ణ, రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Read also: Botsa Satyanarayana: చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి బొత్స